Home Health Stomach Pain : పొట్ట నొప్పి ఎక్కడ వస్తుందో తెలుసుకుంటే… మీ సమస్య ఏంటో స్పష్టంగా...

Stomach Pain : పొట్ట నొప్పి ఎక్కడ వస్తుందో తెలుసుకుంటే… మీ సమస్య ఏంటో స్పష్టంగా తెలుస్తుంది!

Abdominal Pain Location Can Reveal the Root Health Problem – Know What It Means
Abdominal Pain Location Can Reveal the Root Health Problem – Know What It Means

చాలామందికి తరచూ కడుపునొప్పి, మంట, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిని చిన్న విషయంగా భావించి తాత్కాలికంగా మందులు వేసుకుని మానేస్తారు. కానీ నొప్పి యొక్క స్థానం ఆధారంగా అసలైన కారణాన్ని గుర్తించవచ్చని హోమియో నిపుణులు చెబుతున్నారు. పొట్టను తొమ్మిది ప్రాంతాలుగా విభజించి, ప్రతి చోట నొప్పికి ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలతో సంబంధం ఉందని వివరించారు.

కుడి పైభాగంలో నొప్పి – గాల్ బ్లాడర్ స్టోన్స్ లేదా హెపటైటిస్‌ సూచన.

మధ్యపై భాగం – అల్సర్ లేదా గ్యాస్ట్రిటిస్ సమస్య.

ఎడమ పైభాగం – ప్రాంకియాస్ సంబంధిత సమస్యలు; కొన్ని సార్లు క్యాన్సర్‌కి సూచన.

కుడి మధ్యభాగం – కిడ్నీ రాళ్లు లేదా మలబద్ధకం.

నాభి ప్రాంతం – ఫుడ్ పాయిజనింగ్, మలబద్ధకం, హెర్నియా.

ఎడమ మధ్యభాగం – ఎడమ కిడ్నీ రాళ్లు, మలబద్ధకం.

కుడి కిందభాగం – అపెండిసైటిస్, ఒవేరియన్ సిస్టు లేదా గర్భసంబంధిత సమస్యలు.

పొత్తి కడుపు ప్రాంతం – యూటీఐ, పీరియడ్స్ క్రాంప్స్, ఫైబ్రాయిడ్స్.

ఎడమ కిందభాగం – హెర్నియా లేదా గర్భసంబంధిత సమస్యలు.

గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. సరైన నిర్ధారణ, చికిత్స కోసం వైద్యులను సంప్రదించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here