Home Andhra Pradesh Yanam Police Station : పదే పదే కాల్ చేసి..పోలీసులకు చుక్కలు చూపించిన బుడ్డోడు!

Yanam Police Station : పదే పదే కాల్ చేసి..పోలీసులకు చుక్కలు చూపించిన బుడ్డోడు!

Young Boy Repeatedly Calls Police Station Demanding Pani Puri and Chocolates
Young Boy Repeatedly Calls Police Station Demanding Pani Puri and Chocolates

పోలీస్ స్టేషన్‌కు కాల్ చేసి ఎవరైనా కూడా ఫిర్యాదు చేస్తారు. కానీ ఓ బుడ్డోడు మాత్రం పోలీసులకు కాల్ చేసి చుక్కలు చూపించాడు. వివరాల్లోకి వెళ్తే.. యానాం పోలీస్ స్టేషన్‌కు కొన్ని రోజుల కింద ఓ కాల్ వచ్చింది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయగా ఫస్ట్ ఎవరూ మాట్లాడలేదు. ఫిర్యాదు కోసమైతే వారే చేస్తారని పోలీసులు వదిలేశారు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ కాల్ వచ్చింది.

ఇలా కాల్ చేయకూడదని చెప్పినా..
ఓ చిన్న పిల్లాడు నాకు పానీపూరీ, చాక్లెట్లు కొనివ్వండని అడిగాడు. తెలియక పిల్లాడు చేశాడని పోలీసులు లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత కూడా మళ్లీ కాల్ చేసి చాక్లెట్లు కావాలని అడిగారు. పోలీసులు ఇలా కాల్ చేయకూడదని చెప్పారు. ఇక ఆ పిల్లాడు కాల్ చేయడని పోలీసులు భావించారు. కానీ అలా చెప్పిన తర్వాత కూడా పలు మార్లు కాల్ చేసి చాక్లెట్లు, పానీపూరీ కొనివ్వమని అడిగాడు. దీంతో పోలీసులు వారి అడ్రస్ కనుక్కుని ఇంటికి వెళ్లారు.

తల్లి ఫోన్‌తో గేమ్స్ ఆడుతూ కాల్ చేశాడని పోలీసులు గుర్తించారు. ఇకపై కాల్స్ చేయవద్దని పిల్లాడితో పాటు తల్లికి కూడా చెప్పారు. అలాగే పిల్లాడికి కావాల్సిన వాటిని కూడా కొనివ్వమని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here