స్పెర్మ్ కౌంట్ పెంచాలంటే సరైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం అవసరం. బ్రోకలీ, పాలకూర, అవకాడోలో ఉండే విటమిన్ E, టమాటా, ఆరెంజ్, ద్రాక్షలో ఉండే విటమిన్ C స్పెర్మ్ కణాలకు రక్షణ ఇస్తాయి. జింక్, విటమిన్ B6 అధికంగా ఉండే వాల్నట్స్, బాదం స్పెర్మ్ తయారీలో సహాయపడతాయి. సాల్మాన్ చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు రక్త ప్రసరణ మెరుగుపరచి స్పెర్మ్ పనితీరును పెంచుతాయి. వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు కూడా స్పెర్మ్ కౌంట్ పెంచడంలో కీలకం. పౌష్టికాహారం తో పాటు ని
ద్ర, ఒత్తిడి నియంత్రణ, వ్యాయామం, ధూమపానం మానేయడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే స్పెర్మ్ ఆరోగ్యం మెరుగవుతుంది.