From Street Struggles to Stardom: The Inspiring Journey of Johnny Lever
తెలుగు సినీరంగంలో అడుగుపెట్టి, తన ప్రత్యేక శైలిలో సహజ నటన, వినోదాత్మక కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన జానీ లివర్ ఇప్పుడు బాలీవుడ్లో ప్రముఖ హాస్య నటుడిగా నిలిచాడు. చిన్ననాటి నుండి ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతూ పెరిగిన ఆయన, కేవలం 7వ తరగతి వరకే చదివారు.
పూణే వీధుల్లో పెన్నులు అమ్ముతూ జీవనం కొనసాగించేవాడు. అయితే నటనపై ఉన్న ఆసక్తితో, ప్రముఖ సినీ తారల మిమిక్రీ చేస్తూ, హిందీ పాటలపై తన స్టైల్లో డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకునేవాడు. జానీ లివర్ అసలు పేరు జాన్ ప్రభాకర్ రావు, తెలుగు కుటుంబానికి చెందినవారు.
చిన్నప్పుడు తండ్రి మద్యానికి బానిసగా ఉండటంతో ఇంటి బాధ్యతలు తన భుజాలపై వేసుకున్నాడు. జీవితంలోని కఠినమైన దశల్లో 13 ఏళ్ల వయసులో ఆత్మహత్య ప్రయత్నం చేసినా, తన చెల్లెళ్ళను గుర్తుచేసుకుని ఆ ఆలోచన నుంచి బయటపడ్డాడు. ఈ అనుభవాలే ఆయన కామెడీకి పునాది అయ్యాయి.
జీవితాన్ని ఎదుర్కొన్న తత్వం వల్లే ప్రేక్షకులకు నవ్వులు పంచే గొప్ప హాస్యనటుడిగా ఎదిగాడు. బాజీగర్, ఖిలాడీ, కరణ్ అర్జున్, కహో నా ప్యార్ హై, కబీ ఖుషీ కబీ ఘమ్ వంటి అనేక హిట్ హిందీ చిత్రాల్లో నటించిన ఆయన, దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించి బాలీవుడ్లో అగ్రహాస్య నటుడిగా గుర్తింపు పొందారు.
ప్రస్తుతం ఆయనకు రూ.250 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని అంచనా. ముంబైలో 3BHK అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఆయన జీవిత కథ నిజమైన శ్రమ, పట్టుదలతో ఎలా విజయాన్ని సాధించవచ్చో స్పష్టంగా చూపిస్తుంది.