CM Chandrababu : చంద్రబాబూ.. మీరు సూపర్ సర్..!

సీఎంగా ఉన్నా.. ప్రతిపక్ష నేతగా ఉన్నా.. ఎలాంటి స్థానంలో ఉన్నా కూడా.. చంద్రబాబు చంద్రబాబే.. అని టీడీపీ నేతలు చెబుతుంటారు. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నారు కూడా. ఇప్పుడు మరోసారి.. తన టాలెంట్ ను నిరూపించుకున్నారు చంద్రబాబు. దేశంలో ఉన్న 31 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో.. టాప్ రిచెస్ట్ సీఎంగా చంద్రబాబు ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు… వారు స్వయంగా సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా అధ్యయనం చేసి.. ఈ విషయాన్ని వెల్లడించాయి. 931 కోట్ల రూపాయల ఆస్తులతో చంద్రబాబు టాప్ ప్లేస్ లో ఉన్నట్టుగా ఈ సర్వే తేల్చింది.

చంద్రబాబు తర్వాత స్థానాల్లో.. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ.. 322 కోట్ల 56 లక్షల రూపాయల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 51 కోట్ల 93 లక్షలతో మూడో స్థానంలో నిలిచారు. నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫియూ రియో.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆ తర్వాతి స్థానాలను సాధించారు. ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచి ప్రస్తుత ముఖ్యమంత్రుల్లో అత్యంత పేద ముఖ్యమంత్రిగా ఉన్నారు.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇలా.. తన పనితీరుతో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగానే కాదు.. వ్యక్తిగత క్రమశిక్షణతోనూ.. ఆర్థికంగా ఇప్పుడు తన తోటివారితో పోలిస్తే నంబర్ వన్ గా ఉన్నారు.. చంద్రబాబు.

ఈ విషయంలో కొందరు విమర్శలు కూడా చేయవచ్చు. రాజకీయ నాయకుడిగా ఉన్న చంద్రబాబు అన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులను ఎలా కూడబెట్టారని ప్రశ్నించవచ్చు. కానీ.. ఆయన మార్గదర్శకత్వంలోనే హెరిటేజ్ అనే సంస్థ అత్యంత విజయవంతగా నడుస్తున్న విషయాన్ని, ఆ సంస్థను చంద్రబాబు కుటుంబ సభ్యులే నడిపిస్తున్న వాస్తవాన్ని అంతా గుర్తించాలి. అలాగే.. ప్రతి సంవత్సరం తన ఆస్తులు, అప్పుల వివరాలను.. ప్రెస్ మీట్ పెట్టి మరీ మీడియాకు తెలియజేస్తున్నారు చంద్రబాబు. తనవి మాత్రమే కాదు.. తన కుటుంబ సభ్యుల పేరుమీదున్న ఆస్తులు కూడా క్రిస్టల్ క్లియర్ గా వివరిస్తున్నారు. మొదట్లో… తానే మీడియా ముందుకు వచ్చి ఆ వివరాలు తెలియజేసిన ఆయన.. ఆ తర్వాత తన కుమారుడు లోకేశ్ కు ఆ బాధ్యత అప్పగించారు.

ఇలా.. ఆస్తుల విషయంలో పక్కా లెక్కలతో పూర్తి ట్రాన్స్ పరెన్సీ మెయింటైన్ చేస్తూ వస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు దేశంలోనే రిచెస్ట్ సీఎం జాబితాలో టాప్ ప్లేస్ లో నిలిచారు. న్యూ ఇయర్ సంబరాల వేళ.. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు.. మరీ ముఖ్యంగా చంద్రబాబు అభిమానులైతే తమ సంబరాలను రెట్టింపు చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులకు తమ నాయకుడు ఆదర్శంగా నిలిచారని ప్రశంసిస్తూ.. చంద్రబాబు మొనగాడు అని కీర్తిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here