ఆంధ్రప్రదేశ్(Andhra pradesh).. మరో భారీ పెట్టుబడిని ఆకర్షించింది. 10 వేల కోట్ల పెట్టుబడి.. ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉద్యోగాలు(Employement).. పరోక్షంగా మరో 5 వేల మందికి ఉపాధి కల్పించే ఈ ఇన్వెస్ట్ మెంట్ పై.. త్వరలో నిర్ణయం ఖరారు కానుంది. 930 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్(Solar Power Plant), అలాగే.. 465 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు రిలయన్స్(Reliance), ఎన్‌యూ సన్ టెక్ సంస్థలు(NU SunTech Organisations) నిర్ణయించాయి. ఇందుకు.. ఆంధ్రప్రదేశ్ ను వేదిక చేసుకోవాలని నిర్ణయించాయి. ఈ మేరకు.. కర్నూలు(Kurnool) జిల్లాలో ఈ సంస్థల ప్రతినిధులు ఇప్పటికే 2 స్థలాలను పరిశీలించినట్టు తెలుస్తోంది.
అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం.. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ఏర్పాటైతే.. ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టు ఇదే కానుంది. కనీసం 6 వేల మందికి ఈ సోలార్ పవర్ ప్రాజెక్టు.. ఉపాధి కల్పించే అవకాశాలున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. వచ్చే రెండేళ్లలోనే ఇది ప్రారంభం కావాలి. ఆ తర్వాత.. 25 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోళ్లకు సెకీతో ఒప్పందం కుదురుతుంది. ఈ విద్యుత్ ను.. దేశ వ్యాపంగా ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలకు అందిస్తారు. అక్కడి నుంచి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. సరఫరా చేయాల్సి ఉంటుంది.
ఈ విషయంపై.. చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వం కూడా సీరియస్ గా వర్కవుట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాయలసీమలో ఈ ప్రాజెక్టు ఏర్పాటైతే.. ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు.. అభివృద్ధికి కూడా అవకాశాలు పెరుగుతాయని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే.. స్థలాల పరిశీలన కూడా త్వరగా పూర్తయినట్టు సమాచారం అందుతోంది. వచ్చే ఒకటి, రెండు నెలల్లోనే ఈ విషయంపై పూర్తి స్థాయిలో స్పష్టత వస్తే.. అతి త్వరలో ఆసియాలోనే అతి పెద్దదైన ఈ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఆయన కృతనిశ్చయంతో ఉన్నారని టీడీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి.