దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు(Ram Gopal varma) చెక్ బౌన్స్ కేసులో(Check bounce case) తగిలిన తీర్పు పెద్ద షాక్ ఇచ్చింది. ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు(Andheri court) వర్మను దోషిగా తేల్చి, మూడు నెలల సాధారణ జైలు శిక్షతో(Imprisonment) పాటు జరిమానా విధించింది. ఈ కేసు గత ఏడేళ్లుగా కోర్టులో విచారణలో ఉంది. తాజాగా కోర్టు తీర్పు వెలువడినప్పుడు, వర్మ కోర్టుకు హాజరుకాకపోవడంతో, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. వర్మపై, సెక్షన్ 138 ప్రకారం, రూ. 3.72 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ పరిహారం చెల్లించకపోతే, మరో మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది.
వర్మపై ఇది జారీ చేసిన నేరం “నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్” చట్టం కింద నమోదు అయ్యింది. 2018లో మహేశ్ చంద్ర మిశ్రా తరపున శ్రీ సంస్థ ఈ కేసు దాఖలు చేసింది.
శివ, సత్య, రంగీలా, కంపెనీ, సర్కార్ వంటి పాపులర్ చిత్రాలతో రామ్ గోపాల్ వర్మ స్టార్ డైరెక్టర్ గా ఎదిగినా, తరువాత అతని సినిమాల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వర్మ తన స్థాయి తగ్గించి చిన్న సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ‘సిండికేట్’ అనే సినిమాను రూపొందించనున్నట్లు ప్రకటించారు. “ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెర్రిఫైయింగ్ యానిమల్” అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాను రూపొందించనున్నారు.