Home Entertainment Avatar 3 Release : జేమ్స్ కామెరూన్ అద్భుతం.. అవతార్ 3 రిలీజ్ ఎప్పుడో తెలుసా...

Avatar 3 Release : జేమ్స్ కామెరూన్ అద్భుతం.. అవతార్ 3 రిలీజ్ ఎప్పుడో తెలుసా ?

avatar 3
avatar 3

జేమ్స్ కామెరూన్(James Cameron) విజువల్ వండర్ ‘అవతార్’.ప్రపంచ చిత్ర పరిశ్రమలో ‘అవతార్’ ఓ సంచలనం. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఓ అద్భుత ప్రపంచమిది. పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్తో అందరినీ కట్టిపడేశారు దర్శకుడు. ఆ తర్వాత ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ తో మంచి ట్రీట్ ఇచ్చారు. ఆ ప్రాంచైజీలో రానున్న మూడో భాగాన్ని పంచ భూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్ రూపొందించనున్నారు.అవతార్ త్రీ ఫై జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ”ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ చిత్రం ఉంటుందని , తెరపై ఈ విజువల్ వండర్ను చూసిన ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతారని చెప్పారు . గత రెండు చిత్రాల కంటే బిన్నంగా ఈ మూవీ ఉంటుందని అంటున్నారు .. ఈ మూవీ 2025 డిసెంబరు 19న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. అలాగే అవతార్ సిరీస్ లో రానున్న ‘అవతార్ 4’ 2029లో, చివరిగా ‘అవతార్ 5 ‘ 2031 డిసెంబరు లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించారు ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here