ఇంగ్లాండ్(England) పై క్లీన్ స్వీప్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో.. టైటిల్ కొట్టడమే ధ్యేయంగా బరిలోకి దిగుతోంది. మరో 5 రోజుల్లో.. అంటే.. ఈ నెల 19 న పాకిస్తాన్(Pakistan), దుబాయ్ వేదికలుగా ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. రేపో ఎల్లుండో.. భారత జట్టు కూడా దుబాయ్‌కి(Dubai) పయనం కానుంది. ఇంతలో.. బీసీసీఐ తీసుకున్న కఠిన నిర్ణయం.. భారత క్రికెటర్లను షాక్ కు గురి చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళే ఆటగాళ్లతో.. వారి కుటుంబాలను అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. కేవలం.. ప్లేయర్లు.. వారితో పాటు కోచింగ్ బృందం, ఇతర సాంకేతిక బృందాన్ని మాత్రమే పంపించాలని బీసీసీఐ డెసిషన్ తీసుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీ టోర్నమెంట్(Champions Trophy) అయిన కారణంగానే ఇంతటి కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని బీసీసీఐ.. తన నిర్ణయంపై వివరణ ఇచ్చింది. ఆటగాళ్ళ దృష్టి ఆటపై మాత్రమే ఉండేలా.. ఇతర వ్యవహారాలపైకి మళ్లకుండా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు తెలిపింది. అయితే.. ఇంగ్లాండ్ తో సిరీస్ ముగిసేవరకు బీసీసీఐ(BCCI) ఈ నిర్ణయాన్ని బహిర్గతం చేయలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ మరో 5 రోజుల్లో మొదలు కానుందన్న తరుణంలో.. ఉన్నట్టుండి కొత్త నిబంధన ప్రకటించి ఆటగాళ్లను షాక్ కు గురి చేసింది. ఇప్పటికే ఇలాంటి ప్రతిపాదనపై మాజీ ఆటగాళ్ళ నుంచి అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ.. అవేవీ పట్టించుకోకుండా.. బీసీసీఐ మాత్రం.. ఆటగాళ్లతో ఛాంపియన్స్ ట్రోఫీకి వారి కుటుంబాలను అనుమతించేది లేదని స్పష్టం చేస్తోంది. ఈ వ్యవహారంపై ప్లేయర్లు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.
Watch Video For More Deatils–>