బీఎస్ఎన్ఎల్(BSNL) స్పీడ్ పెంచింది. తన కస్టమర్ల కోసం అతి చవకైన ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం.. 1198 రూపాయలకే 365 రోజుల వాలిడిటీతో సేవలు అందిస్తోంది. ఈ ప్లాన్ లో ప్రతి నెల 300 నిముషాల ఫ్రీ కాల్స్.. దేశ వ్యాప్తంగా ఫ్రీ రోమింగ్.. ప్రతి నెలా 3 జీబీ డేటా.. ప్రతినెలా 30 ఎస్ఎంఎస్ లు అందుబాటులో ఉంటాయి. సాధారణ ప్లాన్లతో.. కేవలం ఇన్ కమింగ్ మాత్రమే కోరుకునే వాళ్లకు ఈ ప్లాన్ అత్యంత ఉపయుక్తం కానుంది. ఇలాంటి ప్లాన్.. పోటీ సంస్థలైన ఎయిర్ టెల్, జియోతో పాటుగా.. మరో సంస్థ అయిన వొడాఫోన్ ఐడియా కూడా ఇవ్వలేకపోవడం.. ఇక్కడ గమనించాల్సిన విషయం.
ఇక మరో ప్లాన్ విషయానికి వస్తే.. 411 రూపాయలకు.. 90 రోజుల వాలిడిటీతో.. అన్ లిమిటెడ్ కాలింగ్.. రోజుకు 2 జీబీ డేటా వాడుకోవచ్చు. అలాగే.. 1515 రూపాయల ప్లాన్ తో అయితే.. 365 రోజుల వాలిడిటీతో.. రోజుకు 2 జీబీ డేటా.. అన్ లిమిటెడ్ కాలింగ్.. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు వాడుకోవచ్చు. అంటే.. నెలకు కేవలం యావరేజ్ గా 150 రూపాయలు కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇంత భారీ ప్రయోజనాల్ని పొందవచ్చు. ఇది గమనిస్తున్న వాళ్లంతా.. బీఎస్ఎన్ఎల్ కు తమ నంబర్ ను పోర్ట్ చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఈ మధ్య రెండు సిమ్(Dual sim) కార్డులు వాడుతున్న వాళ్లంతా.. అందులో ఒక నంబర్ ను కచ్చితంగా బీఎస్ఎన్ఎల్ ది ఉంచుకునేలా జాగ్రత్తపడుతూ.. ఖర్చును తగ్గించుకుంటున్నారు. త్వరలో.. తన 5 జీ నెట్ వర్క్‌ను(5g Services) మరింత పెంచుకుని.. దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు బీఎస్ఎన్ఎల్ ప్లాన్ చేస్తున్న పరిస్థితుల్లో.. మరింత మంది యూజర్లు ఈ సంస్థవైపు మొగ్గుచూపే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే.. పోటీ సంస్థలు కూడా ప్లాన్లు తగ్గించాల్సిన పరిస్థితి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Watch Video for Full Details –>










