కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం(Bramhanandam) ప్రధాన పాత్రలో ‘బ్రహ్మా ఆనందం’ సినిమా వస్తోంది. ఈ మూవీలో ఆయన కుమారుడు రాజా గౌతమ్(Raja Goutham) కీలకపాత్రలో నటిస్తున్నారు. తండ్రీకొడుకులు ఈ సినిమాలో తాతమనవళ్లుగా నటించారు. ఫిబ్రవరి 14వ తేదీన తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే బ్రహ్మా ఆనందం మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), దర్శకులు నాగ్‍అశ్విన్(Nag ashwin), అనిల్ రావిపూడి(anil ravipudi) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ ఈవెంట్‍లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. బ్రహ్మానందం గురించి గొప్పగా ప్రశంసించారు. ఈ క్రమంలోనే బ్రహ్మానందం మీమ్స్ గురించి సరదాగా మాట్లాడుతుండగా చిరు నోరు జారారు. మాటల్లో ఒక బూతు దొర్లడంతో చిరంజీవి ట్రోలర్స్ కి దొరికిపోయాడు.
మెగాస్టార్ వంటి వ్యక్తి వేదికపై అలాంటి పదం వాడడం ఏంటి అని కొందరు ట్రోల్ చేస్తున్నారు. బ్రహ్మానందం గురించి మాట్లాడుతూ అలాంటి పదం సరికాదని అంటున్నారు. ఎప్పుడూ ఆచి తూచి మాట్లాడే చిరూ.. ఇలా నోరుజారడం ఆశ్చర్యంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అయితే, సరదాగా మాట్లాడే క్రమంలో ఒక్కోసారి ఇలా జరుగుతుందని మెగా అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు.