రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City) భూములపై.. మరో వివాదం.. వార్తల్లోకొచ్చి సెన్సేషన్ సృష్టిస్తోంది. 2007లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో.. నాటి వైఎస్ ప్రభుత్వం.. 670 మందికి ఇంటిస్థలాలు కేటాయించిందని చెబుతూ.. సీపీఎం నాయకులు ఉద్యమాన్ని తీవ్రం చేస్తున్నారు. 16 ఏళ్లు గడుస్తున్నా కూడా.. ఇప్పటికీ లబ్ధిదారులకు భూమి ఇవ్వలేదని ఆరోపిస్తూ.. ఆందోళనకు దిగుతున్నారు. ఇబ్రహీం పట్నం మండల పరిధిలోని ముకనూరు గ్రామంలో.. ఈ మేరకు లబ్ధిదారులైన కుటుంబాలతో సమావేశమయ్యారు. ఇళ్ల స్థలాల పోరాట కమిటీని ఎన్నుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకుంటే.. తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
అయితే.. ఈ వ్యవహారంలో ఓ ట్విస్ట్ ఉంది. అది కూడా వాళ్లే చెబుతున్నారు. అదేంటంటే.. 2007లో వైఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలను.. ఆ తర్వాతి కాలంలో వైఎస్ మరణం అనంతరం.. అధికారులు తిరిగి తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.










