హనీ బన్ని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న “శక్తిమతి” సినిమా మోషన్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఆవిష్కరించారు. ఈ చిత్రం ఆయన శిష్యుడు డి. రామకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ – “1947 నుండి ఓ కథా సూత్రాన్ని తీసుకొని దాన్ని మా డైరెక్టర్ రామకృష్ణ గారు అభివృద్ధి చేసి నాతో పంచుకున్నారు. ఆ కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా నేటి తరానికి తప్పక చూపించాల్సినదని భావించి నిర్మించాను. సినిమా ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది” అని తెలిపారు.
దర్శకుడు డి. రామకృష్ణ మాట్లాడుతూ – “నా గురువు వి.వి. వినాయక్ గారి చేతుల మీదుగా మోషన్ పోస్టర్ లాంచ్ కావడం నాకు ఎంతో గౌరవంగా ఉంది. మా నిర్మాత వెంకటేష్ గారు నిర్మాణంలో ఎలాంటి రాజీ పడకుండా, అన్ని విషయాల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చారు. సంగీత దర్శకుడు భీమ్స్ అద్భుతమైన సంగీతం అందించారు. భాను మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ సినిమాకి హైలైట్ అవుతుంది. ఇందులో సుమారుగా 30 నిమిషాల వరకు VFX ఉంది, అందుకే కొంత సమయం తీసుకుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనిలో ఉన్నాం. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యాక, ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వస్తాం. మీరు అందరూ మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అన్నారు.