టాక్స్ పేయర్లకు(Tax payers) గుడ్ న్యూస్. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. లక్షల మందికి మేలు చేకూరేలా.. కొత్త బడ్జెట్(Budget) లో ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం ఓల్డ్ రిజిమ్, న్యూ రిజిమ్ పన్ను విధానాలు అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో న్యూ రిజిమ్ విధానాన్ని తీసుకుని టాక్స్ చెల్లిస్తున్నవారికి కేంద్రం.. తాజా ప్రతిపాదనతో భారీ ఊరట కల్పించింది. స్టాండర్డ్ డిడక్షన్స్ తో కలుపుకుంటే.. సుమారు 12 లక్షల 75 వేల వార్షిక ఆదాయం వరకు టాక్స్ సున్నా అయ్యేలా ప్రతిపాదనలు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ.. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) చెప్పిన ప్రకారమైతే.. 12 లక్షల 75 వేల రూపాయల ఆదాయం వరకైతే సున్నా పన్నును అమలు చేయనున్నట్టు తేలింది. వచ్చే వారం ఇన్ కమ్ టాక్స్ బిల్లును చట్ట సభల ముందుకు కేంద్రం తీసుకువచ్చే అవకాశం ఉంది. అప్పుడు మిగతా కీలక వివరాలు తెలిసే అవకాశం ఉంది.