ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్(Prayag Raj) లో జరుగుతున్న కుంభమేళా(Kumbhamela) ఉత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. ప్రపంచం నలుమూల నుంచి లక్షలాది భక్తులు త్రివేణి సంగమం వద్ద చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా, కుంభమేళాలో పూసలు అమ్ముతున్న ఓ యువతి సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు ఆమెను ‘బ్రౌన్ బ్యూటీ’గా(Brown bueaty) పిలుస్తున్నారు. ఆమె పేరు మోనాలిసా భోస్లే(Monalisa bhosle). నీలి కళ్లతో పూసలు అమ్ముతూ ఆకట్టుకున్న ఈ అమ్మాయి కుంభమేళాకు వచ్చిన వారిని మురిపించింది.
వైరల్ అయిన ఈ యువతీ వీడియో అనుకోకుండా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఈ వీడియో 15 మిలియన్ల వ్యూస్ సాధించింది. దీంతో, కుంభమేళాకు వచ్చిన నెటిజన్లు, యూట్యూబర్లు ఆమెను వెతుక్కుంటూ వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఈ కారణంగా, ఆమె వ్యాపారం జరపడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఎందుకంటే చాలా మంది సెల్ఫీలు మరియు వీడియోల కోసం ఎగబడుతున్నారు.
ఇందుకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పరిస్థితిని చూసిన కొంతమంది నెటిజన్లు, ‘‘బతకడానికోసం వస్తే, ఇలా చేస్తారా? పేదింటి పిల్ల మీద ఇలా చేయడం ఏంటి?’’ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.