మహా సిమెంట్(Maha cement), మై హోమ్ ఇండస్ట్రీస్(My home industries), వినియోగదారుల సేవలను అందించడంలో విశేషంగా ముందుకు సాగుతోంది. మెరుగైన సేవలతోపాటు ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సంస్థ కొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది. ముఖ్యంగా మార్కెట్ వాటాను పెంచడానికి, వినియోగదారులకు సిమెంట్ బల్క్ సరఫరా సదుపాయం అందించేలా 250 సిమెంట్ బల్క్ ట్యాంకర్లను ప్రవేశపెట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రసిద్ధి చెందిన మహా సిమెంట్, మై హోమ్ గ్రూప్ హైదరాబాదులో ప్రధాన కేంద్రంగా పనిచేస్తూ, సిమెంట్, రియల్ ఎస్టేట్(Real estate), కన్స్ట్రక్షన్(Construction), పవర్, మీడియా, ఎడ్యుకేషన్ వంటి రంగాలలో ప్రతిష్టను సంపాదించింది. ఈ గ్రూపు మూడు దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తూ విశ్వాసాన్ని గెలిచింది.
విస్తృతమైన లాజిస్టిక్స్ రంగంలో అభివృద్ధి చెందుతూ, మహా సిమెంట్ బల్క్ సరఫరా కోసం భారీ ట్రక్కులను, ట్రైలర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు శ్రీనగర్ లో ఈ ట్రక్కులను ప్రారంభించారు. 14 వీల్స్ కలిగిన ట్రక్కులు, 16 వీల్స్ కలిగిన వంద ట్రక్కులు, అలాగే 41 టన్నుల సామర్థ్యంతో 50 ట్రైలర్లు ప్రారంభించబడ్డాయి.
మై హోమ్ ఇండస్ట్రీస్ గ్రూప్ లో 10,000 మందికి ప్రత్యక్ష మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించాయి. జాతీయ స్థాయిలో, వివిధ విభాగాల్లో కస్టమర్లు ఉన్నారు. ఉత్పత్తుల నాణ్యతతో పాటు వ్యాపార ప్రమాణాలను పాటించడం ద్వారా, మై హోమ్ గ్రూప్ తన ప్రత్యేకతను మరింతగా చాటుకుంటోంది.