
తమ్ముడు మంచు మనోజ్ (Manchu Manoj) ను చూసి.. అక్క మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఎమోషనల్ అయిపోయింది. సడన్ గా కనిపించిన తమ్ముడిని చూసి ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంది. తన బాధను బయటికి చెప్పుకోలేక.. మొహాన్ని చేతుల్లో దాచేసుకుని కుమిలి కుమిలి ఏడ్చేసింది. అక్క ఎమోషనల్ అవడాన్ని చూసి బాధపడిన తమ్ముడు మనోజ్.. ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్న అక్కను.. తన భార్య భూమా మౌనికతో (Bhuma Mounika) కలిసి భుజం తట్టాడు. కన్నీళ్లు తుడిచి.. నార్మల్ స్థితికి తీసుకువచ్చాడు. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన బోధనలు అందించాలన్న లక్ష్యంతో మంచు లక్ష్మి నిర్విహించిన టీచ్ ఫర్ ఛేంజ్ ఈవెంట్ లో.. ఈ ఎమోషనల్ సందర్భం జరిగి.. అందరి మనసులను కదిలించింది.
ప్రతి సంవత్సరం మాదిరే.. ఈ సారి కూడా టీచ్ ఫర్ ఛేంజ్ ఈవెంట్ ను మంచు లక్ష్మి భారీ స్థాయిలో నిర్వహించింది. ప్రముఖ నటీమణులు రియా చక్రవర్తి(Rhea Chakraborty), కేతికా శర్మ(Ketika Sharma), అనసూయ(Anasuya) వంటి వారు హాజరై ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేశారు. అక్క లక్ష్మిని సర్ ప్రైజ్ చేస్తూ.. ఆ కార్యక్రమానికి తన భార్య భూమా మౌనికతో కలిసి తమ్ముడు మంచు మనోజ్ కూడా అటెండ్ అయ్యాడు. అప్పటికి స్టేజ్ పై అరేంజ్ మెంట్స్ చూస్తున్న లక్ష్మి.. సడన్ గా తమ్ముడిని చూసి షాక్ అయ్యింది. ఆ వెంటనే తీవ్ర ఆవేదనకు గురైంది. అది చూసి మనోజ్ కూడా బాధపడ్డాడు. ఈ ఇద్దరూ ఇంత ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకోవడం.. ఒకరి కోసం ఒకరు ఆవేదనకు గురి కావడం అక్కడున్న అందరి దృష్టినీ ఆకర్షించింది.
అక్కపై తమ్ముడికి.. తమ్ముడిపై అక్కకు ఉన్న ప్రేమ ఎంత గొప్పదో కదా.. అని అంతా ముచ్చటపడేలా.. లక్ష్మి, మనోజ్ పలకరించుకున్నారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. చూస్తుంటే.. మనోజ్ కు లక్ష్మి సపోర్ట్ బాగానే ఉన్నట్టుందని.. తండ్రిని, విష్ణును బాధపెట్టడం ఇష్టం లేకే ఆమె మౌనంగా ఉంటోందని చాలా మంది ఓపెన్ గా కామెంట్ చేస్తున్నారు. భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకున్నప్పుడు తండ్రి మోహన్ బాబు కానీ.. అన్న మంచు విష్ణు కానీ మనోజ్ కు అండగా నిలబడని తీరును ఇప్పుడు మనోజ్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. అప్పుడు కూడా మంచు లక్ష్మి అన్నీ తానై పెళ్లి పనులు చూసుకుందని.. తన ఇంట్లోనే పెళ్లి వేడుక నిర్వహించి.. ఓ తల్లిలా కార్యక్రమాన్ని నిర్వహించిందని అంటున్నారు.
అన్నాదమ్ముల మధ్య జరుగుతున్న గొడవకు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడితే.. అంతా కలిసి మెలిసి ఉంటే.. చూడాలని ఉందని మంచు వారి అభిమానులు.. ఈ పరిణామంతో ఆరాటపడుతున్నారు. తమ్ముడిపై అక్కకు ఉన్న అభిమానం ఎంత గొప్పది అన్నది తాజా ఘటన నిరూపించిందని అంటున్నారు. కనీసం మోహన్ బాబు అయినా.. పెద్దరికాన్ని ప్రదర్శించి తన కొడుకుల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించాలని మంచు వారి అభిమానులు మాత్రమే కాదు.. వారి గొడవలను గమనిస్తున్న ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. ఈ విషయంలో మోహన్ బాబు, విష్ణు ఎలా స్పందిస్తారన్నది పక్కనబెడితే.. అక్కగా మంచు లక్ష్మి.. తమ్ముడిగా మనోజ్ చూపించిన ఈ పరస్పర అభిమానం మాత్రం.. ముచ్చటగా ఉందని అంటున్నారు.
మరి.. తన ఇంట్లో జరుగుతన్న గొడవలపై.. అభిమానులు ఆశిస్తున్నట్టుగా మోహన్ బాబు ముందు నిలిచి పరిష్కరిస్తారా? మునుపటిలాగే లక్ష్మి, విష్ణు, మనోజ్.. మళ్లీ కలిసిమెలిసి ఉంటారా?