మణిపుర్‌లో(Manipur) చాలా కాలంగా జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మెయితెయ్ మరియు కుకీ తెగల మధ్య హింస తీవ్రంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో, ఫిబ్రవరి 13, 2025న మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు.
ఈ హింసను నియంత్రించలేకపోయారనే కారణంతో, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. పరిస్థితి మరింత దిగజారటంతో,
19 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వారిలో అసెంబ్లీ స్పీకర్, మంత్రులు కూడా ఉన్నారు. ఈ పరిణామాల తర్వాత బీరెన్ సింగ్ దిల్లీకి వెళ్లి హోం మంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత తన పదవికి రాజీనామా చేశారు.అయితే, కొత్త సీఎం ఎంపికపై భాజపాలో ఏకాభిప్రాయం రాకపోవడంతో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించడానికి నిర్ణయం తీసుకుంది.
మణిపుర్‌లోని మెజార్టీ సమూహం మెయితెయ్. మైనారిటీ కుకీలు, నాగాలు కూడా అక్కడ నివసిస్తున్నారు. మెయితెయ్‌లు తమను షెడ్యూల్డ్ ట్రైబ్ లిస్ట్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, మైనారిటీ సమూహాలు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ వివాదం 2023 మే 3న భారీ హింసగా మారింది. భూ స్వామ్య హక్కులు, ప్రభుత్వ పాలన, మియన్మార్ నుంచి అక్రమ వలసలు—ఇవి అన్నీ కలసి మణిపూర్‌లో ఉద్రిక్తతలను పెంచాయి.
Watch Video For More Deatils–>