Superstar మహేష్ బాబుతో, director ధీరుడు Jakkanna SS Rajamouli చేస్తున్న సినిమాపై.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ మూవీతో Jakkanna ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడన్నది అందరిలో క్యూరియాసిటీ పెంచుతోంది. అందుకు తగినట్టే.. ఈ మధ్యే షూటింగ్ ప్రారంభించుకున్న Mahesh, Rajamouli సినిమాపై.. ఏ చిన్న వార్త వినిపించినా.. క్షణాల్లో వైరల్ అయిపోతోంది. రీసెంట్‌గా.. director Rajamouli గురించిన బయటికి వచ్చిన ఓ న్యూస్.. ఇలాగే సెన్సేషన్ అయ్యింది. వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీలో.. ఏకంగా 200 కోట్ల రూపాయలు.. Rajamouli రెమ్యూనరేషన్ కే వెళ్లిపోతున్నాయట. directorగానే ఇంత తీసుకుంటే.. heroకి ఇంకెంత ఇస్తారో కదా అని అంతా అనుకుంటున్నారు.
Hero Mahesh కు కనీసం 300 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఉండవచ్చని.. ఈ ఇద్దరికీ కలిపే ఏకంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతన్నాయని.. మరో 100 నుంచి 150 కోట్ల రూపాయలు హీరోయిన్, ఇతర ముఖ్య నటులు, సాంకేతిక వర్గానికి ఖర్చు చేయాల్సి వస్తుందని అంతా లెక్కలు కడుతున్నారు. ఈ లెక్కన షూటింగ్ కోసం.. 350 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. Rajamouli సినిమాలకు ఎప్పటిలాగే.. ఈ సారి కూడా షూటింగ్ ఆలస్యమై.. డబ్బులు కూడా మరింతగా అవసరం అయితే.. అంతా కలిపి సినిమాకు 1200 కోట్ల నుంచి 1500 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెడతారేమోనని లెక్కలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదంతా తెలుసుకుంటున్న సామాన్యులు మాత్రం.. ఓ సినిమాకు ఇంత ఖర్చా అని ఆశ్చర్యపోతున్నారు. Mahesh తో Jakkanna సినిమా అంటే ఆంతే ఉండాలిలే అని fans అంటున్నారు.
మరోవైపు.. Rajamouli చిన్న ప్రాజెక్టులుగా చెప్పి తీసిన గత సినిమాల గురించి కూడా చాలా మంది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. Maryada Ramanna అంటూ Sunil ను heroగా పెట్టి.. చిన్న సినిమా అని చెప్పి.. అప్పట్లో బడ్జెట్ ను భారీగా పెంచేశాడు Jakkanna. అలాగే.. Eega అంటూ అప్పుడు కూడా చిన్న సినిమానే అని చెప్పి Naniతో భారీ బడ్జెట్ సినిమాగా చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇలా.. ఏ సినిమాకైనా అనుకున్న బడ్జెట్ ను మించి ఖర్చు చేయడం.. అంతకు మించిన కలెక్షన్ల కుంభవృష్టి కురిపించేలా మ్యాజిక్ చేయడం Rajamouliకి అలవాటే కదా.. అని సినిమా వర్గాలు చెప్పుకుంటున్నాయి. Remuneration, Budget అంటూ.. Rajamouli సినిమా గురించి మాట్లాడుకోవడాన్ని మానేస్తేనే బెటర్ అంటూ కామెంట్ చేస్తున్నాయి. సినిమా రిలీజ్ నాటికి.. ఇంతకుమించిన విషయాలు బయటికి వచ్చి.. అంతా ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంటుందని కూడా అంచనాలు వ్యక్తం చేస్తున్నాయి.
Amazon అడవుల నేపథ్యంలో Maheshతో Jakkanna తీస్తున్న ఈ సినిమాపై.. ఇలా ప్రతి చిన్న విషయం చాలా పెద్దగా జనాన్ని ఆకర్షిస్తోంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ కోసం IDTVని సబ్‌స్క్రైబ్ చేయండి.










