మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) టాలీవుడ్‌ను శాసించే స్థాయికి వచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా వెలుగు వెలుగుతున్న ఆయన.. ఏం చదివారు. ఆయన టెన్త్ క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా..?
మెగాస్టార్ 10th మెమోను(10th memo) ఎప్పుడైనా చూశారా..?సాధారణ కానిస్టెబుల్ కుటుంబంలో పుట్టి.. ఎన్నో కష్టాలను అనుభవించి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ చేసి.. హీరోగా.. సుప్రీమ్ హీరోగా.. ఆతరువాత మెగాస్టార్ గా.. ఎదిగి చూపించారు చిరంజీవి.
ఆయన గురించి ఇంతకంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటన, డాన్స్, సమాజసేవ, ఇలా అనేక అంశాలు ఆయనన్ను జనాలకు దగ్గర చేశాయి. మెగాస్టార్ గా.. రియల్ హీరోగా నిలబెట్టాయి. అంతే కాదు ఇండస్ట్రీలో తన సాంమ్రాజ్యాన్ని గట్టిగా నిలబెట్టాడు చిరంజీవి. టాలీవుడ్ లో మెగా సాంమ్రాజ్యాన్ని సృస్టించారు.
బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీని మించి.. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ.. ఇండస్ట్రీలో ఎదిగారు. చిరంజీవి నీడ నుంచే.. టాలీవుడ్ లో అరడజనుకు పైగా స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఎలుతున్నారు. అందులో ఇద్దరు హీరోలు పాన్ ఇండియా ను శాసిస్తున్నారు. నలుగురు స్టార్ హీరోలు కొనసాగుతున్నారు.
సినిమా నిర్మాణంతో పాటు.. ఇండస్ట్రీకి పెద్దగా చిరంజీవి రోల్ అందరికి తెలిసిందే. సపోర్ట్ లేకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చి, టాప్ హీరో స్థాయికి ఎదగడం అంటే మాములు విషయం కాదు. ఇలా కేవలం తన స్వయంకృషితో టాలీవుడ్ లో ఈ స్థాయిని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.