నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందం, అభినయంతో తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో తనదైన శైలిలో మెప్పించి, ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది.
ప్రస్తుతం ఆమె బాలీవుడ్ మరియు కోలీవుడ్ సినిమాలతో బిజీగా గడుపుతోంది.నయనతార విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి సరోగసి ద్వారా కవల బిడ్డలు పుట్టారు. అప్పటి నుంచి ఆమె తరచూ తన పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది.
ఇటీవల మదర్స్ డే సందర్భంగా విఘ్నేష్ శివన్ తన భార్య నయనతారకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగ భరితమైన మెసేజ్ షేర్ చేశారు. తన కుమారులతో కలిసి మదర్స్ డే జరుపుకున్న ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ ఫోటోలకు క్యాప్షన్‌గా – “నయన్, నీవు తల్లి అయిన తర్వాత నీ ఆనందం వర్ణించలేనిది. నువ్వు, మనమంతా ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలి. నువ్వు ఒక అద్భుతమైన తల్లి” అని అన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.