పచ్చి పాల తీరు, సుకుమారి లేత నవ్వులతో ప్రేక్షకులను మోహించిన పాయల్ రాజ్ పుత్, అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో ఆమె నటన మరియు అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించడం ద్వారా, ఈ చిత్రం విడుదలైనప్పుడు కుర్రకారిని ఫిదా చేసింది.
పాయల్ రాజ్ పుత్ 1992 డిసెంబర్ 5న ఢిల్లీలో విమల్ కుమార్ రాజ్ పుత్, నిర్మల్ రాజ్ పుత్ దంపతులకు జన్మించింది. యాక్టింగ్‌లో డిప్లొమా చేసిన పాయల్, ప్రముఖ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.
తన తల్లిదండ్రులతో ముంబైలో నివసిస్తున్న ఈ బ్యూటీకి చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఉండడంతో, గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక చిత్రసీమలో అడుగుపెట్టింది. మొదటగా బుల్లితెరపై కెరీర్ ప్రారంభించిన ఈ భామ, 2010లో “సప్నోన్ సే భరే నైనా” అనే హిందీ సీరియల్లో సోనాక్షిగా నటించింది. “ఆఖిర్ బహు భీ” అనే సీరియల్లో సియా పాత్రను పోషించి మంచి గుర్తింపును సంపాదించింది.
అలాగే, “గుస్తాఖ్ దిల్”, “మహాకుంభ్: ఏక్ రహస్యా”, “ఏక్ కహానీ” వంటి సీరియల్స్‌లోనూ నటించింది.2017లో, పంజాబీ సినిమా “చన్నా మేరేయా”తో సినిమాకు పరిచయమై, కథానాయకిగా తన కెరీర్ ప్రారంభించింది. 2018లో హిందీ చిత్రం “వీర్ కీ వెడ్డింగ్”లో నటించి బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది.
అలాగే 2018లో “ఆర్ఎక్స్ 100” అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈ సినిమాతో పాయల్, యంగ్ హీరో కార్తికేయతో జోడీగా నటించి మంచి గుర్తింపు సంపాదించింది. తరువాత, వెంకటేష్ సరసన “వెంకీ మామ” సినిమాలో కథానాయకిగా నటించింది. 2023లో వచ్చిన “మంగళవారం” సినిమాతో మంచి ప్రభావం చూపిన పాయల్, ప్రస్తుతం “వెంకటలచ్చిమి” అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది.