కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్(Shivaraj Kumar).. ప్రస్తుతం తెలుగులో పెద్ది(Peddi) అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global star Ram Charan) హీరోగా.. జాన్వీకపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో.. శివన్న పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు. పెద్ది సినిమాతో.. తెలుగులో పూర్తి స్థాయి స్ట్రెయిట్ సినిమా ఇస్తున్న ఆయన.. మరో క్రేజీ ప్రాజెక్ట్ తో టాలీవుడ్ లోని తన అభిమానులను పలకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ సారి తన సోదర సమానుడు, బెస్ట్ ఫ్రెండ్ అయిన బాలకృష్ణతో(Balakrishna) ఆయన ఒకే స్క్రీన్ పై కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై అలా రూమర్ బయటికి వచ్చిందో లేదో.. ఇలా కన్నడ, తెలుగు సినిమా ప్రపంచాల్లో వైరల్ అయిపోయింది. నిజంగా ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారా.. అంటూ క్యూరియస్ గా ఆరా తీసేవారు పెరిగిపోతున్నారు.
శివన్న.. ఇప్పటికే బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి(Gautamiputra Satakarni) సినిమాలో నటించారు. ఇద్దరికీ కలిపి సీన్లు లేకున్నా కూడా.. ఆ సినిమాలో కీలక పాత్రనే పోషించారు. ఆ సినిమాకు ముందే.. శివన్నతో బాలయ్యబాబుకు స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. ఎన్టీఆర్, రాజ్ కుమార్ ల మధ్య ఉన్న స్నేహాన్ని.. వారి వారసులుగా బాలయ్య, శివన్న కంటిన్యూ చేశారు. ఈ క్రమంలో.. శివన్న తమ్ముడు పునీత్ గుండెపోటుతో చనిపోయినప్పుడు బాలయ్య విలవిలలాడిపోయాడు. చిన్న పిల్లాడిలా కంటతడి పెట్టుకుని కుమిలికుమిలిపోయారు. శివన్నతో కలిసి.. పునీత్ ను చూస్తూ వెక్కి వెక్కి ఏడ్చాడు. అంతగా.. శివన్న కుటుంబంతో బాలయ్య బాబు అనుబంధాన్ని పెనవేసుకున్నాడు. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో.. ఇద్దరూ ఒకే వేదికపై కలిసి తమ అనుబంధాన్ని చాటుకున్నారు.
పర్సనల్ రిలేషన్ లో ఇంత స్ట్రాంగ్ గా ఉన్న ఈ ఇద్దరూ.. సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే.. అభిమానులంతా దబిడి దిబిడే.. అనాల్సిందే. వాళ్లు చేసుకునే సంబరాలను మనమంతా చూసి తీరాల్సిందే. అలాంటి సెన్సేషనల్ అప్ డేట్.. ఇప్పుడు కన్నడ, తెలుగు సినీ రంగాలను చుట్టేస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించనున్న జైలర్ 2 సినిమాలో.. బాలకృష్ణ నటించబోతున్నారని, కన్నడ సూపర్ స్టార్ శివన్న కూడా కీలక పాత్ర చేయబోతున్నారని.. ఓ గాసిప్.. విపరీతంగా గుసగుసమంటోంది. ఇదే విషయాన్ని ఈ మధ్య ఓ విలేకరి శివన్నను ప్రశ్నించగా.. ఇంట్రెస్టింగ్ ఆన్సర్ వచ్చింది. జైలర్ 2లో తాను నటించే విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా కన్ఫమ్ చేసిన శివన్న.. బాలయ్య బాబు గురించి మాత్రం తనకు తెలియదని అన్నాడు.
అయితే.. జైలర్ 2 (Jailer 2) లో బాలయ్య నటిస్తే బాగుంటుందని తాను అనుకుంటున్నట్టు శివన్న చెప్పాడు. తనకు బాలయ్యతో ఎంతో అనుబంధం ఉందని.. ఇద్దరం కలిసి నటిస్తే బాగుంటుందని కూడా చెప్పుకొచ్చాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే.. ఆ విలేకరి అడిగిన ప్రశ్నకు.. లేదు.. కాదు అని మాత్రం శివన్న క్లియర్ గా చెప్పలేదు. కాబట్టి.. ఇద్దరి కాంబోలో సినిమా ఉండడం మాత్రం ఖాయమే.. అని బలంగా ఇద్దరి అభిమానలు ఫిక్స్ అయిపోతున్నారు.