చెన్నై విమానాశ్రయంలో(Chennai Airport) కస్టమ్స్ అధికారులు అరుదైన వన్యప్రాణులను రక్షించారు. మలేషియాలోని కౌలాలంపుర్ నుండి వచ్చిన ఇద్దరు స్మగ్లర్లను(Smuglers) పట్టుకుని వారి ట్రాలీ బ్యాగుల్లో అక్రమంగా తరలిస్తున్న జంతువులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఎఈస్టర్న్ గ్రే గిబ్బన్స్ మరియు మిల్స్ స్టోన్ పోల్‌క్యాట్స్ ఉన్నాయి. అందులో రెండు జంతువులు ప్రాణాలు కోల్పోయాయి.
ఇంటెలిజెన్స్ ద్వారా అందిన సమాచారం ప్రకారం, కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. మార్చి 7న, మలేషియా(Malasiya) ఎయిర్‌లైన్స్ విమానంలో చెన్నై చేరుకున్న ఇద్దరు ప్రయాణికులను అడ్డుకున్నారు. వారి చెక్-ఇన్ లగేజీని తనిఖీ చేసి, వెంటిలేటెడ్ పెట్టెల్లో 8 అరుదైన జంతువులను(Animals) దాచినట్లు కనుగొన్నారు. ఈ జంతువులను శాస్త్రీయ పేర్లతో గుర్తించి, చనిపోయిన వాటిని సురక్షితంగా దహనం చేశారు. మిగిలిన వాటిని తిరిగి మలేషియాకు పంపించారు.
వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కస్టమ్స్ యాక్ట్, 1962 సెక్షన్ 110 మరియు వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇద్దరిని అలందూర్ కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
మలేషియా మరియు థాయిలాండ్ వంటి దేశాలతో సమీపంలో ఉన్న చెన్నై, గతంలో అక్రమ పెంపుడు జంతువుల వ్యాపారానికి కేంద్రంగా మారింది. ఇటీవల చెన్నైలో చేపట్టిన తనిఖీలను కఠినతరం చేయడంతో, స్మగ్లర్లు వివిధ విమానాశ్రయాల ద్వారా వన్యప్రాణులను దేశంలోకి తీసుకురావడం మొదలుపెట్టారు. చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇటీవల మలేషియాలోని ప్రయాణికుడి వద్ద నుండి ఆరు బ్లాక్-కాలర్ స్టార్లింగ్‌లను స్వాధీనం చేసుకున్నారు.