సమంత(Samantha).. మరోసారి జీవిత భాగస్వామి విషయంపై స్పందించింది. భార్యాభర్తల బంధంలో.. వ్యక్తిగత ఆరోగ్యం కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేసింది. ఆరోగ్యాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. లైఫ్ పార్ట్ నర్ ను పోగొట్టుకోవాల్సి వస్తుందని సంచలన కామెంట్లు చేసింది. జీవిత భాగస్వామితో ఎంతో అందమైన అనుబంధాన్ని కలిగి ఉన్నా.. మానసికంగా.. శారీరకంగా ఆరోగ్యంగా(Physical health) లేకుంటే.. ఆ బంధానికి బీటలు వారడం ఖాయమని సమంత అభిప్రాయపడింది. అనారోగ్యంతో ఉంటే.. మీ పార్ట్ నర్ కు మీరు నచ్చకపోవచ్చని.. అది గుర్తించకపోతే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని.. చివరికి పార్ట్ నర్ నే కోల్పోయే అవకాశాలు ఉంటాయని కామెంట్ చేసింది.
ఇదంతా గమనిస్తున్న అభిమానులు.. సమంత ఎంతగా బాధపడితే.. ఇంతగా ఆవేదనతో కూడిన మాటలు చెప్పి ఉంటుంది కదా.. అని అభిప్రాయపడుతున్నారు. గతంలో ఓ హీరోతో పెళ్లి.. ఆ తర్వాత ఆనందకరమైన జీవితం.. సినిమాలు.. మంచి స్టార్ డమ్.. ఇలా అంతా బానే ఉందనుకున్న టైమ్ లో.. సడన్ గా ఆమె జీవిత భాగస్వామితో విభేదాలు.. అదే సమయంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడడం.. ఆ తర్వాత చికిత్స.. ఇలా సమంత తన జీవితంలో మంచితో పాటు చెడును కూడా అనుభవించిన సీక్వెన్స్ ను గుర్తు చేసుకుని ఫ్యాన్స్ అయితే తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి వేదాంతానికి సమంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు
Watch Video For More Deatils–>