యంగ్ హీరో ఉదయ్ రాజ్ మరియు వైష్ణవి సింగ్ నటించిన టీనేజ్ లవ్ స్టోరీ **”మధురం”**, శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాజేష్ చికిలే దర్శకత్వంలో, యం. బంగార్రాజు నిర్మాణంలో ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది.
హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ, ఈ చిత్రం తన కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అని, యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని తెలిపారు. దర్శకుడు రాజేష్ చికిలే, 1990 దశకంలో స్కూల్ వాతావరణాన్ని చూపించేలా తెరకెక్కించినట్లు చెప్పారు.
నిర్మాత యం బంగార్రాజు, ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చిందని, ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మకంగా చెప్పారు. హీరోయిన్ వైష్ణవి సింగ్, తన పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు.