లవ్ స్టోరీల్లో 7/జి బృందావన్ కాలనీ(7/G Brindavan Colony) సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వేరే లెవల్. దర్శకుడు సెల్వ రాఘవన్ (Selva Raghavan) సృష్టించిన ఈ మ్యాజికల్ వండర్.. అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా సమ్ థింగ్ స్పెషల్. సినిమాను ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. పాటలు కూడా మళ్లీ మళ్లీ వినాలని అనిపించేంత బెస్ట్ గా ఉంటాయి. ఇప్పటికీ.. చాలా మంది మొబైల్స్ లో.. కార్లలోని మ్యూజిక్ సిస్టమ్స్ లో రెగ్యులర్ గా ఈ మూవీ పాటలను ప్లే చేస్తుంటారు. అంతగా.. ఆనాటి యూత్ జనాలు.. 7/జీ కి కనెక్ట్ అయ్యారు. ఇంతటి ప్రభావాన్ని కలిగించిన ఈ సినిమాకు.. సీక్వెల్(sequel) సిద్ధమైందన్న వార్తతో.. చాలా మంది ప్రేమికులు ఎమోషన్ అవుతున్నారు. ఆ నాటి తమ లవ్ స్టోరీని గుర్తు చేసుకుంటూ.. మరోసారి 7/జి పార్ట్ వన్ చూసేస్తున్నారు. సీక్వెల్ ఎప్పుడు వస్తుందా.. అందులో ఎమోషన్స్ ఏ స్థాయిలో ఉంటాయా అన్నది కూడా చర్చించేసుకుంటున్నారు
అసలు విషయానికి వస్తే.. 7/జి పార్ట్ వన్ లో హీరో క్యారెక్టర్ పేరు రవి. ఆ మూవీలో హీరోయిన్ చనిపోతుంది. అయినా కూడా ఆమె బతికే ఉందన్న ఆలోచనలతో రవి కాలాన్ని వెళ్లదీస్తుంటాడు. ఆమెతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆత్మ రూపంలో ఉన్న హీరోయిన్.. రవితో కనెక్టివిటీలో ఉంటుంది. ఈ క్యారెక్టర్లలో హీరో రవికృష్ణ, హీరోయిన్ సోనియా అగర్వాల్ చూపిన నటన.. హావభావాలు.. చాలా సెన్సిటివ్ గా.. అంతకుముంచి నాచురల్ గా ఉన్న కారణంగానే.. 7/జి బృందావన్ కాలనీ సినిమా ఘన విజయాన్ని సాధించింది. అందరి అభిమానాన్ని దక్కించుకోగలిగింది. అందుకే.. పార్ట్ 2 సిద్ధమైందని తెలియగానే.. సినిమా గురించి అంతటా ఆసక్తి వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ పార్ట్ 2 లో.. రవి ఒంటరి జీవితం చుట్టూ కథ తిరుగుతుందట. ప్రియురాలి మరణం తర్వాత రవి ఎలా బతికాడు.. ఎలా జీవితంలో నిలదొక్కుకున్నాడు.. తన ప్రియురాలి ఆశలను ఎలా నెరవేర్చాడు అన్నది కీ పాయింట్ గా ఉంటుందట. అలాగే.. మరోసారి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ (Yuvan Shankar Raja’s).. మ్యాజిక్ చేయడం ఖాయమని కూడా తెలుస్తోంది. కానీ.. ఈ సీక్వెల్ లో హీరోయిన్ ఉంటుందా.. ఆమె ఎవరు.. మళ్లీ సోనియా అగర్వాల్ నే హీరోయిన్ గా చూపించబోతున్నారా.. అన్నది క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమాపై.. క్లారిటీతో కూడిన పూర్తి అప్ డేట్స్ అతి త్వరలో రానున్నట్టుగా తెలుస్తోంది.
ఇంతగా ఆకర్షిస్తున్న 7/జి బృందావన్ కాలనీ సీక్వెల్.. ఎలాంటి ప్రభావాన్న కలిగిస్తుంది.. అంచనాలను ఎంతవరకు అందుకుంటుంది అన్నది తేలాలంటే.. ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. మరి.. 20 ఏళ్ల క్రితం విడుదలైన 7/జి బృందావన్ కాలనీ సినిమాను మీరు చూశారా.. మీకు కానీ, మీ ఫ్రెండ్స్ కు కానీ ఈ మూవీతో ఏమైనా స్పెషల్ కనెక్టివిటీ ఉందా?..










