విశ్వంభర (vishwambhara)సినిమా.. శరవేగంగా ముస్తాబవుతోంది. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) .. మరోసారి తన యాక్టింగ్ తో మ్యాజిక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సంగీత దర్శకుడు కీరవాణి(keeravani).. తన మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. వీఎఫ్ఎక్స్ కారణంగా ఓ సారి.. కథలో మార్పులతో మరోసారి వాయిదా పడుతూ వచ్చింది. అతి త్వరలో విడుదల కావడానికి అవసరమైన పని పూర్తి చేసుకుంటోంది. ఇంతలో.. విశ్వంభర గురించి ఓ సీక్రెట్ బయటికి వచ్చింది. ఈ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ పై ఫ్యాన్స్ లో కొందరు ఉత్సాహంగా ఎగిరి గంతేస్తుంటే.. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం గతాన్ని గుర్తు చేసుకుని టెన్షన్ పడుతున్నారు. రిస్క్ అవసరమా అన్నయ్యా అంటూ.. చిరంజీవిని అలర్ట్ చేస్తున్నారు.
గతంలో మాస్టర్(master) సినిమా కోసం.. తమ్ముడూ అరె తమ్ముడూ పాటను పాడి సెన్సేషన్ క్రియేట్ చేశారు చిరంజీవి. తర్వాత.. మృగరాజు (Mrugaraju) సినిమా కోసం.. చాయ్ చటుక్కునా తాగరా భాయ్.. అంటూ మరోసారి సింగింగ్ టాలెంట్ చూపించారు. ఈ పాటలు సూపర్ హిట్ అయినా.. సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తాకొట్టాయి. కానీ.. శంకర్ దాదా ఎంబీబీఎస్ (Shankar Dada’s MBBS) సినిమా కోసం.. పాటలో ఓ భాగాన్ని పాడిన చిరు.. ఆ సినిమాతో గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకున్నారు. ఇన్నాళ్లకు.. మరోసారి ఆయన పాట పాడేందుకు రెడీ అవుతున్నారని.. అది కూడా విశ్వంభర సినిమాతోనే అని.. తెలిసి ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇప్పటికే కీరవాణి.. అద్భుతమైన కంపోజిషన్ కూడా రెడీ చేశారని తెలిసి షాక్ అవుతున్నారు.
గతంలో చిరంజీవి పూర్తి స్థాయిలో పాట పాడిన సినిమాలు రెండూ పరాజయం పాలైన విషయాన్ని గుర్తు చేసుకుని కొందరు అభిమానులు టెన్షన్ పడుతున్నారు. వాయిదాల మీద వాయిదాలు పడుతున్న విశ్వంభర సినిమాతో.. మరోసారి ప్రయోగం ఎందుకని బయటికి చెప్పలేక.. లోపల దాచుకోలేక ఆలోచనలో పడిపోతున్నారు. అయితే.. చిరు మాత్రం ఈ సారి హిట్ పక్కా అని ఫిక్సైపోయారట. అభిమానులకు ఘనమైన విజయాన్ని కానుకగా అందివ్వాలని.. అందులో తాను కూడా పాట పాడి మరింతగా భాగం కావాలని ఈ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. మరి.. నిజంగానే.. చిరు పాట పాడేందుకు సిద్ధమయ్యారా.. ఆ ట్యూన్ ఎలా వచ్చింది అన్నది తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.