Home Telangana KCR Birthday Celebrations : తెలంగాణలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

KCR Birthday Celebrations : తెలంగాణలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

kcr birthday
kcr birthday

బీఆర్ఎస్(BRS) పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశే ఖర్ రావు(KCR) జన్మదిన వేడుకలను(Birthday celebrations) సోమవారం అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్(Thalasani srinivas yadav) చెప్పారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా తన ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్‎డే(KCR Birthday) వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లుచేస్తున్నట్టు చెప్పారు. ఈ వేడుకలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత, ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్ల, పార్టీ నాయకులు, అభిమానులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు.

ఆదివారం ఆయన హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్లో పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లను మాజీ మంత్రి మహ – మూద్ అలీ, తెలంగాణభవన్ ఇన్చార్జి రావుల – చంద్రశేఖర్రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో తలసాని – మాట్లాడుతూ.. ఉదయం 10 గంటలకు కేసీ – ఆర్ జన్మదిన వేడుకలు ప్రారంభం అవుతా యని చెప్పారు. తొలుత డప్పు కళాకారులు, గిరిజన వేషధారణలో నృత్యాల ప్రదర్శన, కళా కారులతో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వ హణ ఉంటుందని తెలిపారు. అనంతరం కేసీ – ఆర్ జీవిత, రాజకీయ ప్రస్థానంతో కూడినప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత కేసీఆర్ 71వ పుట్టిన రోజు సందర్భంగా 71 కిలోల భారీ కేక్ను కట్ చేయనున్నట్టు చెప్పారు.

Watch Video For more details—>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here