Home Telangana BJP Bandi Sanjay : రాజాసింగ్ వివాదంలో.. ‘బండి’ ఎంట్రీ

BJP Bandi Sanjay : రాజాసింగ్ వివాదంలో.. ‘బండి’ ఎంట్రీ

rajasingh
rajasingh

హైదరాబాద్(Hyderabad) పరిధిలోని గోల్కొండ జిల్లా(Golconda) బీజేపీ అధ్యక్షుడిగా తను సూచించిన నేతకు అవకాశం ఇవ్వలేదంటూ.. పార్టీ నాయకత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja singh) అలిగిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయంపై.. సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ స్పందించారు. రాజాసింగ్ ను ఉద్దేశించి ఊరడింపు మాటలు చెబుతూనే.. ఆయన తీరును ఇన్ డైరెక్ట్ గా తప్పుబట్టారు. సమస్యలు ఉండొచ్చు కానీ.. మాట్లాడుకుంటే అన్నీ పరిష్కారం అవుతాయని కామెంట్ చేశారు. పార్టీలో పదవుల వ్యవహారంపై స్పందించిన బండి సంజయ్.. నియమ నిబంధనల ప్రకారమే బాధ్యతలను అప్పగిస్తామని తేల్చి చెప్పారు. అంతే కానీ.. ఎంఐఎంతో కలిసి తిరిగే నేతకు కీలక బాధ్యతలు కట్టబెట్టామన్న ఆరోపణలో నిజం లేదని పరోక్షంగా తేల్చి చెప్పారు.
For more details watch video–>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here