వైసీపీలో(YCP) ఉన్నప్పుడు విజయసాయిరెడ్డిపై(Vijay Sai Reddy) భూముల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. పార్టీకి ఉత్తరాంధ్ర ఇన్‌చార్జిగా ఉన్న సమయంలో విశాఖలో విలువైన భూములను అక్రమంగా పొందారని, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారని విమర్శలు వచ్చాయి. ఆయన కుమార్తె నేహారెడ్డి(Neha reddy) కొనుగోలు చేసిన స్థలం చుట్టూ ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు, అక్కడ అక్రమంగా ప్రహరీ నిర్మించడమే కాకుండా, వాటర్ బాడీల ఆకృతిని మార్చేలా నిర్మాణాలు చేశారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంశంపై హైకోర్టులో కేసులు నమోదయ్యాయి. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఆయా భూముల్లోని ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకుంది.
ఈ పరిణామాల తర్వాత సాయిరెడ్డి మెల్లగా వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో తన భూముల విషయంలో మొండిగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు అధికారికంగా నిర్మాణాలకు అనుమతులు కోరడం విశేషంగా మారింది. జనసేన(Janasena) కార్పొరేటర్ మూర్తి యాదవ్(Murthy yadav) హైకోర్టులో వేసిన కేసు, ఈ నెల 5న కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. భీమిలి-నేరేళ్ల వలస ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన ప్రహరీల తొలగింపుపై కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేయడంతో, ప్రభుత్వం ఐదుగురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సాగర తీరంలో సర్వే నిర్వహించి, అక్రమ నిర్మాణాలను గుర్తించి తొలగించేందుకు చర్యలు తీసుకున్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.
Watch Video For more details—>