రణ్బీర్(Ranbir kapoor) హీరోగా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్(Animal) సినిమా.. ప్రశంసలతో పాటు విమర్శలను కూడా ఈక్వల్ గా అందుకుంది. వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి.. బాక్సాఫీస్ ను కొల్లగొట్టింది. రణ్ బీర్ యాక్షన్ కు.. సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) డైరెక్షన్ టాలెంట్ కు.. బీ టౌన్ మూవీ ఫ్యాన్స్ అయితే ఫిదా అయ్యారనే చెప్పాలి. మహిళను తక్కువ చేసి చూపించారన్న విమర్శలు తప్ప.. మిగతా అంతా యానిమల్ సినిమా తీసిన విధానంపై ప్రశంసలే కురిపించింది. అంతగా జనానికి కనెక్ట్ అయిన ఈ మూవీ సీక్వెల్ పై జనాల్లో పెద్ద అంచనాలే ఉన్నాయి. అందుకే.. యానిమల్ గురించి కొత్తగా ఏ చిన్న విషయం బయటికి వచ్చినా కూడా.. సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారిపోతోంది.
ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో.. తన డైరెక్షన్ లాగే బోల్డ్ గా స్పందించాడు.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. యానిమల్ పార్క్(animal park) పేరుతో.. సీక్వెల్ ఉంటుందని చెప్పిన ఆయన.. ఇందులో రణ్ బీర్ డబుల్ రోల్ చేస్తాడని చెప్పి.. సరికొత్త సంచలనానికి తెర తీశాడు. హీరో, విలన్.. ఈ రెండు క్యారెక్టర్లను రణ్ బీర్ ఒక్కడే పోషించబోతున్నట్టు చెప్పాడు.
https://youtu.be/7IUcHLng51c










