ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth reddy) ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీతో(PM modi) సమావేశమయ్యారు. రాష్ట్ర విషయాలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి చేయూత ఇవ్వాలని కూడా కోరారు. ఇప్పటివరకు వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఇదే విషయం మీడియా సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. కానీ.. కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం.. మరో విషయాన్ని టచ్ చేస్తున్నారు. కచ్చితంగా.. తెలంగాణ బీజేపీ(TS BJP) నేతల గురించి మోదీ దగ్గర.. రేవంత్ ఫిర్యాదు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అదే జరిగితే.. మోదీ ఎలా స్పందించి ఉంటారోనంటూ.. సరికొత్త చర్చకు తెర తీశారు.
ఈ మధ్యే సీఎం రేవంత్ సంచలన ఆరోపణల చేశారు. కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అయిన కిషన్ రెడ్డే హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నట్టు చెప్పారు. గతంలో తాను ఎంపీగా పనిచేసినప్పటి పరిచయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని.. కేంద్రంలో మంత్రిగా ఉన్న నేతలు తనకు సన్నిహితులే అని రేవంత్ చెప్పారు.
https://youtu.be/MPSwKdpDsEs










