సమంత(Samantha).. మళ్లీ లవ్ లో పడిపోయింది. ఈ సారి ఇక ఆగేదే లేదని.. తన లవ్ జర్నీ కంటిన్యూ అవుతుందని తెలిపింది. అయితే.. ఈ సారి లవ్ లో పడింది వ్యక్తితో కాదు. సినిమా అనే ప్రపంచంతో. అవును. ఈ సారి సామ్.. సినిమాలతోనే లవ్ లో పడింది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. వరుణ్ ధావన్‌తో(Varundhawan) సిటాడెల్ హనీ బన్నీ(Citadel honey bunny) వెబ్ సిరీస్ చేసిన సమంత.. ఇప్పుడు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రక్త్ బ్రహ్మాండ్(Rakth bramhand) అనే సిరీస్ లో జాయిన్ అయ్యింది. ఈ విశేషాలు పంచుకుంటూనే.. తన లవ్ సీక్రెట్ బయటపెట్టింది. సినిమానే ఇకపై తనకు ఫస్ట్ లవ్ అని.. వరుసగా ప్రాజెక్టులు చేయబోతున్నానని చెప్పి.. తన ఫ్యాన్స్ కు స్వీట్ న్యూస్ షేర్ చేసింది.. క్యూటీ సమంత.
తన హెల్త్ ఇష్యూస్ తో కొంత కాలం సినిమాల నుంచి సమంత సైడ్ అయ్యింది. వెబ్ సిరీస్ లలో కనిపించింది తప్ప.. తన క్రేజ్ కు తగినంత భారీ ప్రాజెక్టులు చేయలేదు. ఇలా ఇంకోసారి గ్యాప్ తీసుకునే ప్రసక్తే లేదని.. వరుస సినిమాలతో అభిమానుల ముందుకు వస్తున్నానని ఆమె తేల్చి చెప్పింది. రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ షూట్ పుర్తి కాగానే.. మరో డైరెక్ట్ సినిమా షూట్ కు రెడీగా ఉందని తెలిపింది.










