SLBC ప్రమాదం జరిగిన 9 రోజుల తర్వాత.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth reddy) స్వయంగా స్పందించారు. ఘటనా స్థలాన్ని సందర్శించారు. సొరంగం లోపలికి వెళ్లారు. పై కప్పు కూలిన చోట సహాయ చర్యలను నేరుగా పర్యవేక్షించారు. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై మంత్రులతో సమీక్షించారు. అంతా బానే ఉంది కానీ.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఓ రకంగా చెప్పాలంటే.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా.. సీఎం కామెంట్లు ఉన్నాయి. ఇంతకీ సీఎం మాట్లాడింది ఏంటంటే..
ఎలాంటి ప్రాణ నష్టం ఉండకూడదన్న ఉద్దేశంతో SLBC సొరంగంలోకి.. రోబోలను కూడా పంపించి సహాయ చర్యలు చేస్తామని రేవంత్ అన్నారు. కరెక్టే కానీ.. ఇది ఇప్పటికే జరిగి ఉంటే.. గల్లంతైన కార్మికుల జాడ ఈ పాటికే తెలిసి ఉండేది కదా.. అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.