Home Entertainment Tollywood Remake : హిందీలో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ రీమేక్?

Tollywood Remake : హిందీలో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ రీమేక్?

remake
remake

వెంకటేష్(Venkatesh) హీరోగా దిల్(Dil raju) రాజు నిర్మాణ సారథ్యంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki vastunam) సినిమా.. గత పొంగల్ సీజన్ లో టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించి వెంకీకి, దిల్ రాజు బ్యానర్ కీ మెమొరబుల్ హిట్ ను అందించింది. సినిమా దర్శకుడు అనిల్ రావిపూడికీ కెరీర్ టర్నింగ్ పాయింట్ లాంటి విజయాన్ని అందించింది. అయితే.. ఈ సినిమాను ఇతర భాషల్లో.. ముఖ్యంగా హిందీలో రీ మేక్ చేస్తారంటూ చాలా కాలంగా టాలీవుడ్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అటు దర్శకుడి నుంచి కానీ.. ఇటు నిర్మాణ సంస్థ నుంచి కానీ.. ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. చివరికి.. స్వయంగా దిల్ రాజు.. ఈ విషయంపై స్పందించారు.

తన బ్యానర్ నుంచి గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టును మరోసారి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.. దిల్ రాజు. ఆ విశేషాలను మీడియా సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న విషయంపై విలేకరులు ఆయన్ను ప్రశ్నించారు.

https://youtu.be/HMyZwSHtKrY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here