ప్రముఖ గాయని కల్పన(Kalana).. హాస్పిటల్లో కోలుకుంటున్నారు. 2 రోజులుగా ఇంటి తలుపులు తెరవని తీరుతో.. అపార్ట్మెంట్ కు చెందిన వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి ఆమెను హాస్పిటల్ లో చేర్చిన విషయం తెలిసిందే. వెంటనే పరీక్షలు చేసిన డాక్టర్ల.. కల్పన లంగ్స్ లో నీళ్లు పేరుకుని ఉన్నట్టు గుర్తించారు. సుమారు 12 గంటల పాటు వెంటిలేటర్ పై ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆక్సిజన్ తో చికిత్సకొనసాగిస్తున్నట్టు తెలిపారు. ట్రీట్ మెంట్ కు కల్పన బాగా రెస్పాండ్ అవుతున్నారని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. నిద్రమాత్రలు కాస్త హై డోస్ తీసుకున్న కారణంగానే.. ఈ పరిస్థితి వచ్చినట్టు గుర్తించామన్నారు. ప్రమాదం తప్పిందని, కొన్ని రోజుల్లో కల్పన కోలుకుంటారని స్పష్టం చేశారు.
ఇదే విషయాన్ని కల్పన కూతురు దయ.. మీడియా వారికి తెలిపింది. ఇంట్లో అందరం బాగానే ఉన్నామని, ఆనందంగా ఉన్నామని చెప్పింది. తన తల్లి కల్పన ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదని.. ఆ అవసరం కూడా లేదని స్పష్టం చేసింది. మీడియాలో కొందరు అనవసరంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ.. తమ కుటుంబాన్ని బాధ పెడుతున్నారంటూ ఆవేదనకు గురైంది. ఇప్పటికైనా.. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఆపాలని కోరింది. కచ్చితంగా కల్పన కోలుకుంటారని.. త్వరలోనే అందరిముందుకు వచ్చి మాట్లాడుతారని దయ స్పష్టం చేసింది.