తెలంగాణలో(Telangana) అధికార కాంగ్రెస్ పార్టీకి(Congress) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ సిట్టింగ్ స్థానమైన పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ(MLC Elections) పోటీలో.. ఆ పార్టీ పరాజయాన్ని మూటగట్టుకుంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల మండలి స్థానానికి జరిగిన ఎన్నికలో.. కాంగ్రెస్ పై బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. మొదటి ప్రాధాన్య ఓటు ప్రకారం విజేత ఎవరన్నది తేలని పరిస్థితుల్లో.. రెండో ప్రాధాన్య ఓటు ప్రకారం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి.. 5 వేల 106 ఓట్ల మెజారిటీతో.. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై గెలిచినట్టు అధికారులు ప్రకటించారు.
మొదటి ప్రాధాన్య ఓటు ప్రకారం జరిగిన లెక్కింపులో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కూడా గట్టి పోటీ ఇచ్చారు. ఈ దశలో ఎవరికీ అవసరమైనంత మెజారిటీ రాలేదు.