రేవంత్ రెడ్డి(Revanth reddy) ఒంటరి అవుతున్నారా.. ఆయనకు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా సరైన సహకారం అందడం లేదా.. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి(Delhi) వెళ్లినా కూడా పార్టీ పెద్దలు ఆయనకు సరైన గౌరవం ఇవ్వడం లేదా.. ఈ పరిస్థితి రాను రాను మరింతగా ముదిరి రాజకీయ సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉందా..? ఇదే చర్చ.. ఇప్పుడు రాష్ట్రమంతటా జరుగుతోంది. తెలంగాణ రాజకీయాలపై కాస్తంత అవగాహన ఉన్న ఏ ఇద్దరు మాట్లాడుకున్నా.. ఇదే విషయం గురించి జోరుగా చర్చ జరుగుతోంది. రేవంత్ విషయంలో కాంగ్రెస్ వైఖరి మారకుంటే.. రానున్న రోజుల్లో రాజకీయ సంచలనాలకు తెలంగాణ వేదిక కావడం ఖాయమన్న మాట.. సామాన్యుల నుంచి కూడా బలంగా వినిపిస్తోంది.
ఈ పరిస్థితికి కారణం ఏంటి.. అన్నది కాస్త లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఈ చర్చను.. కులగణన లెక్కల ప్రకటన, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి మొదలుపెట్టాల్సి వస్తోంది. ఎందుకంటే.. కులగణనను సాక్షాత్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా సీరియస్ గానే తీసుకున్నారు