కన్నడ(Kannada) నటి రన్యా రావు(Ranya rao) సృష్టించిన క్రైమ్ కథా చిత్రమ్.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బంగారాన్ని(Gold) ఇలా కూడా అక్రమంగా రవాణా(Smuggling) చేయవచ్చా.. అన్నది తెలుసుకుని జనాలంతా నివ్వెరపోతున్నారు. అది కూడా.. పోలీస్ శాఖలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తికి వరుసకు కూతురు అయిన రన్యా.. ఇంతగా బరితెగించాల్సిన అవసరం ఏమొచ్చిందా అని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆమె చెబుతున్న సమాధానాలు తెలుసుకుంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు విషయానికి వస్తే.. రీసెంట్ గా.. రన్యా రావు.. దుబాయ్ వెళ్లి వచ్చారు. 14 కిలోల 200 గ్రాముల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ నిఘా అధికారులకు బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడ్డారు. ఆమె కదలికలపై సమాచారం అందుకున్న డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు.. గతంలో కూడా ఆమె ఇలాంటి పనులే చేసినట్టు గుర్తించారు. ఈ సారి కూడా దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తోందని తెలిసిన మేరకు పక్కా నిఘా పెట్టారు. ఓ కానిస్టేబుల్ సహాయంతో ఎయిర్ పోర్ట్ నుంచి బయటికి వెళ్తోందని తెలిసి.. ఆమెను చివరి అడుగు ముంగిట అడ్డగించారు. ఆమె బెల్టులో అక్రమ బంగారాన్ని గుర్తించి అరెస్ట్ చేశారు.