ఐసీసీ ఛాంపియన్స్(ICC Champiaons) టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే.. ఆస్ట్రేలియాపై(Australia) సాధించిన విజయంతో ఫైనల్ బెర్త్ ను భారత జట్టు ఖరారు చేసుకోగా.. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్ లో గెలుపుతో ఫైనల్స్ ఎంట్రీ ఇచ్చింది న్యూజిలాండ్(Newzealand). దుబాయ్ వేదికగా.. మార్చి 9న.. అంటే వచ్చే ఆదివారం నాడు ఈ రెండు జట్లు టైటిల్ పోరులో తలపడనున్నాయి. మ్యాచ్ కు మరో 3 రోజులు టైమ్ ఉండడం.. ఇప్పటికే లీగ్ దశలో ఇరు జట్లు ఓ సారి తలపడి ఉండడంతో.. ఇండియా, కివీస్.. ఫైనల్ కోసం ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి.
లాహోర్ లో జరిగిన సెమీస్ పోరులో.. న్యూజిలాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగి విధ్వంసం సృష్టించింది. ఆ జట్టు ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సెంచరీలతో కదం తొక్కారు. దక్షిణాఫ్రికా బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. విల్ యంగ్ 21.. రచిన్ 108.. కేన్ విలియమ్సన్ 102.. డేరీ మిచెల్ 49.. గ్లెన్ ఫిలిప్స్ 49.. బ్రేస్ వెల్ 16.. ఇలా ప్రతి ఒక్కరూ తలో చేయి వేయడంతో.. 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 362 పరుగుల భారీ స్కోరు సాధించింది.