వరుస లీకులతో.. రాజమౌళి(Rajamouli), మహేష్ బాబు(Mahesh babu) సినిమా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇప్పటికే.. గతంలో మహేష్ లుక్స్ బయటికి రాగా.. వైరల్ అయ్యాయి. ఇప్పుడు షూటింగ్ లొకేషన్ నుంచి.. మహేష్ పాటు, పృథ్విరాజ్ సుకుమారన్ పిక్స్ కూడా బయటికి వచ్చాయి. ఒరిస్సాలోని కోరాపుట్ లో షూట్ కు వెళ్లిన ఈ మూవీ యూనిట్.. జనాల కళ్లలో పడింది. వెంటనే.. ఫొటోలు బయటికొచ్చాయి. ఇప్పటివరకూ ఎవరికీ తెలియని పృథ్విరాజ్ సుకుమారన్ విషయం కూడా.. ఈ పిక్స్ తో బయటపడింది. ఈ విషయంపై జక్కన్న కానీ.. సినిమా యూనిట్ కానీ.. ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడం కూడా.. రూమర్లను బలపరుస్తోంది.
ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న ఈ సినిమా యూనిట్.. తర్వాత షెడ్యూల్స్ కోసం విశాఖ మన్యం, కెన్యా, శ్రీలంక లాంటి ప్రాంతాల్లో షూటింగ్ కు వెళ్లనుంది. అక్కడ కూడా మన దేశ సినిమాలకు అభిమానులు ఉన్నారు. పైగా.. రాజమౌళి సినిమా షూటింగ్ అంటే.. జనాల కళ్లు లేజర్ లైట్లలా లీకుల కోసం వెదుకుతూనే ఉంటాయి.