Home Entertainment Kalpana Check To Rumors : సింగర్ కల్పన ఆందోళన: ఒత్తిడి, ఆరోగ్య సమస్యలపై క్లారిఫికేషన్

Kalpana Check To Rumors : సింగర్ కల్పన ఆందోళన: ఒత్తిడి, ఆరోగ్య సమస్యలపై క్లారిఫికేషన్

singer kalpana
singer kalpana

ఒత్తిడి(Stress) కారణంగానే నిద్ర పట్టలేదని…అందుకే నిద్ర మాత్రలు (Sleeping pills)వేసుకున్నానని సింగర్ కల్పన చెప్పారు. అయితే అధిక మోతాదులో వేసుకోవడం వలన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయానని తెలిపారు. నా భర్తపై మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని…దయచేసి అదంతా ఆపేయాలని కోరుతూ ఆమె వీడియో విడుదల చేశారు. నేను, నా భర్త, కుమార్తె సంతోషంగా ఉన్నాం. 45 సంవత్సరాల వయసులో పీహెచ్‌డీ(PHD), ఎల్‌ఎల్‌బీ(LLB) చేస్తున్నాను. నా భర్త సహకారం వల్లే ఇవన్నీ చేయగలుగుతున్నా. ఆయనతో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. మా కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంది. దయచేసి మా జీవితాల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దని కల్పన వేడుకున్నారు.

వృత్తిలో ఒత్తిడే కారణం..
వృత్తిపరంగా తాను చాలా ఒత్తిడిని ఎదుర్కుంటున్నట్టు కల్పన చెప్పారు. దాని వలన నిద్ర పట్టం లేదని…చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్ లో టాబ్లెట్స్ ఓవర్ డోస్ తీసుకున్నాను. అందువల్లే స్పృహ తప్పి పడిపోయాను. అయితే నా భర్త సరైన సమయంలో స్పందించడం, కాలనీ వాసులు, పోలీసుల సహాయంతో నేను ఇవాళ మీ ముందున్నాను. త్వరలోనే మామూలు అయి మిమ్మల్ని మ్ళీ అలరిస్తానని కల్పన చెప్పుకొచ్చారు. నా భర్త సహకారం వల్లనే నచ్చిన రంగంలో రాణించగలుగుతున్నానని చెప్పారు. నా జీవితానికి బెస్ట్ గిఫ్ట్ నా భర్త. నా ఆరోగ్యం గురించి వర్రీ అయిన వారందరికీ నా ధన్యవాదాలు అంటూ వీడియో రిలీజ్ చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here