అమెరికాలో(America lo) మళ్లీ.. మనవాళ్లకు కష్టకాలం దాపురించింది. మాయదారి ట్రంప్(Trump) విధానాలతో.. లక్షలాదిమంది భారతీయులు ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా.. డిపెండెంట్ వీసాపై(Visa) తల్లిదండ్రులతో కలిసి అమెరికాలో ఉంటున్న సుమారు లక్షా 34 వేల మంది భారతీయులు.. ఇప్పుడు బహిష్కరణ ముప్పును ఫేస్ చేయబోతున్నట్టుగా వస్తున్న వార్తలు.. తీవ్ర కలకలాన్ని సృష్టిస్తున్నాయి. హెచ్ 1 బీ వీసాలతో అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లంతా.. తమ పిల్లలను హెచ్ 4 వీసాల సహాయంతో అమెరికా తీసుకువెళ్లే వెసులుబాటు ఉంటుంది. అయితే.. ఆ పిల్లలు 21 ఏళ్ల వయసు వచ్చే వరకు మాత్రమే.. డిపెండెంట్ వీసాపై అమెరికాలో ఉండాలని ఆ దేశ ఇమిగ్రేషన్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదే రూల్ ను వాడుకుని.. అమెరికాలో ఉన్న ఇతర దేశస్థుల సంతానంలో.. మైనారిటీ తీరిన వారందరినీ తిరిగి వారి సొంత దేశాలకు పంపేందుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో చాలా మంది ఉన్నత చదువుల కోసం వీసా సాధించే ప్రయత్నం చేసినా.. అదంత సులభం కాదు. ఒకవేళ వీసా వచ్చినా కూడా.. అప్పుడు వాళ్లంతా విదేశాల నుంచి వచ్చి అమెరికాలో చదువుకుంటున్నట్టు అవుతుంది.
https://youtu.be/V8_VXPdZrNQ