కిరణ్ అబ్బవరం(Kiran Abbavram), రుక్సాన్ థిల్లాన్(Rukshar Dhillon) జంటగా నటించిన దిల్ రూబా(Dilruba) సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజై.. మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మార్చి 14న సినిమాను విడుదల చేసేందుకు యూనిట్ కూడా సన్నాహాలు చేస్తోంది. అంతా బానే ఉందనుకుంటున్న తరుణంలో.. హీరోయిన్ రుక్సాన్ చేసిన కామెంట్లు.. సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఈవెంట్ కు హాజరైన తనను.. పదే పదే ఫొటోలు తీసిన వారిపై సున్నితమైన టోన్ తోనే.. రుక్సాన్ రుసరుసలాడింది. వద్దని చెబుతున్నా.. అలా ఫొటోలు తీస్తే ఎలా అని ప్రశ్నిస్తూ.. ఆవేదనకు గురైంది.
ఇదంతా.. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ వేదికపైనే జరిగింది. అందరూ వేదికపైన మాట్లాడుతున్న క్రమంలో.. తన వంతు రాగానే.. సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెప్పింది రుక్సాన్. తర్వాత.. తీరిగ్గా అసలు విషయంలోకి వచ్చేసింది. ఈ విషయం చెప్పాలా వద్దా అని ఇంతసేపు ఆలోచించినట్టు చెప్పింది. తను వద్దని చెబతున్నా.. కొందరు పదే పదే ఫొటోలు తీశారని.. అది చాలా అసౌకర్యంగా ఉందని తెలిపింది. మీరు అలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఫొటోలు తీస్తుంటే ఎలా ఉంటుందో ఓ సారి ఆలోచించుకోండి.. అంటూ తన మనసులోని బాధను బయటపెట్టేసింది. అలా ఫొటోలు తీసిన వారి పేర్లను చెప్పడం తనకు ఇష్టం లేదన్న రుక్సాన్.. తన బాధ మాత్రం వారికి అర్థమవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పింది.