చెప్పాం కదా ఇందాకే. ఈ కాంబినేషన్ ఏ మాత్రం వర్కవుట్ అయినా.. సినిమా ప్రపంచమంతా ప్రపోజల్ దశలోనే షేక్ అయిపోతుందని. యస్. నిజంగానే అలాంటి మ్యాజిక్ కు టైమ్ వచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమలో స్టైలిష్ స్టార్ గా.. అంతులేని పాపులారిటీని దక్కించుకున్న అజిత్(Ajith) హీరోగా.. మల్టీ టాలెంటెడ్ అయిన ధనుష్(Dhanush) దర్శకుడిగా ఓ సినిమా తెరకెక్కనున్నట్టు కోలీవుడ్ లో హాట్ హాట్ గాసిప్ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం తనే మేల్ లీడ్ గా నటిస్తూ దర్శకత్వం కూడా చేస్తున్న ఇడ్లి కడై సినిమా పూర్తయిన తర్వాత.. ధనుష్.. పూర్తి సమయాన్ని అజిత్ తో తీయనున్న సినిమాకే కేటాయించి.. స్క్రిప్ట్ పని పూర్తి చేస్తారని తెలుస్తోంది.
వాస్తవానికి అజిత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్.. వేరే లెవల్. తమిళనాడులో నంబర్ వన్ హీరో స్థానంతో సంబంధం లేని ఒకే ఒక్క సూపర్ స్టార్ అజిత్. హిట్టా ఫట్టా అన్న సంబంధమే లేకుండా.. జనాలు తండోపతండాలుగా వెళ్లి.. అజిత్ ను స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేస్తుంటారు. మరోవైపు.. యాక్టింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్, డైలాగ్ రైటర్, సాంగ్స్ రైటర్, సింగింగ్.. ఇలా మల్టీ టాలెంట్ ధనుష్ సొంతం.
https://youtu.be/KxCIuWXLzAo