ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ (Mark Shankar Pawanovich).. దాదాపుగా కోలుకున్నాడు. సింగపూర్ (Singapore) లో అగ్ని ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న మార్క్.. క్రమక్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాడు. ప్రమాదానికి గురైన తర్వాత ఐసీయూలో చికిత్స చేసిన వైద్యులు.. తర్వాత ప్రత్యేక గదికి తరలించి పర్యవేక్షించారు. ఆ సమయానికి పవన్ కల్యాణ్ తో పాటు.. చిరంజీవి(Chiranjeevi), సురేఖ దంపతులు కూడా సింగపూర్ కు చేరుకున్నారు(Surekha). వారి పర్యవేక్షణలో.. మార్క్ త్వరగా రికవర్ అయ్యాడు. ప్రస్తుతం ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని మార్క్ పెదనాన్న.. మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా కన్ఫమ్ చేశారు.
మా అబ్బాయి మార్క్ శంకర్.. ఇంటికి చేరుకున్నాడు. కానీ.. అతను పూర్తిగా కోలుకోవాల్సి ఉంది. మా ఇంటి దైవం ఆంజనేయస్వామి(deity Anjaneya Swamy) ఆశీస్సులతో మార్క్ అతి త్వరలో పూర్తి ఆరోగ్యాన్ని పొందుతాడని నమ్ముతున్నాం. హనుమాన్ జయంతి(Hanuman Jayanti) సందర్బంగా.. ఆ భగవంతుడు మాతోనే ఉన్నాడని, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని నమ్ముతున్నాం. పెద్ద ప్రమాదం నుంచి మార్క్ ను బయటపడేలా చేసి కాపాడింది ఆంజనేయుడే అని భావిస్తున్నాం. ఈ సందర్భంలో మా కుటుంబానికి.. ఎంతోమంది మద్దతుగా నిలిచారు. మార్క్ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారు. అందరి ప్రార్థనలు ఫలించి మార్క్ ఆరోగ్యంగా ఉన్నాడు. నా తరఫున, నా తమ్ముడు పవన్ కల్యాణ్ తరఫున.. మా సమస్త కుటుంబం తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.. అంటూ చిరు ట్వీట్చేశారు.
చిరంజీవి ఇచ్చిన అప్ డేట్ తో.. మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. చిన్నారి మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యంగా ఉన్నాడని తెలిసి.. ఆనందిస్తున్నారు. చిరంజీవి చెప్పినట్టుగా.. మార్క్ త్వరగా కోలుకోవాలని, పవన్ తిరిగి సినిమాలు..
రాజకీయాల్లో తన వంతు పాత్రను సమర్థంగా మరింత ఉన్నతంగా కొనసాగించాలని కోరుతున్నారు. ఎలాంటి సందర్బంలో అయినా సరే.. తాము మెగా ఫ్యామిలీ వెంటే ఉంటామని.. ధైర్యంగా ఉండాలని పవన్ కు సోషల్ మీడియా సందేశాలతో తెలియజేస్తున్నారు. మరోవైపు.. ప్రమాదం జరిగిందని తెలియగానే అండగా నిలిచిన వారందరికీ ఫ్యాన్స్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ.. తామంతా మెగా ఫ్యామిలీలో భాగమే అని నిరూపిస్తున్నారు.