సెలెబ్రిటీ లైఫ్ లో ఉన్నవాళ్లు.. ఏం చేసినా సరే. ఇమ్మిడియట్ గా అందరి అటెన్షన్ ను గ్రాబ్ చేసేస్తుంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ(Rowdy Star Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చేస్తున్న(National Crush Rashmika Mandanna), చేసిన పనులు కూడా ఇలానే అభిమానులతో పాటు సినిమావాళ్ల లైఫ్ స్టైల్ ను ఇష్టపడే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే చాలాసార్లు.. ఈ ఇద్దరూ చాలా డెస్టినేషన్లకు వెళ్లారు. విడివిడిగా వెళ్లి.. కలివిడిగా ఆయా ప్రాంతాల్లో కలియతిరిగారు.
ఈ విషయాన్ని ఎవరూ చూడకున్నా కూడా.. ఈ ఇద్దరూ చేసిన సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా.. చాలా మంది ఇది కన్ఫమ్ అని చెబుతుంటారు. రీసెంట్ గా కూడా.. ఇలాంటి పనే చేసి.. మరోసారి సోషల్ డిస్కషన్ కు రీజన్ అయ్యారు.. విజయ్, రష్మిక అసలు విషయం ఏంటంటే.. ఏప్రిల్ 5న రష్మిక బర్త్ డే. ఆ వేడుకలు చేసుకునేందుకు రష్మిక ఒమన్(Oman) కు ఒంటరిగా వెళ్లింది. అక్కడి అందమైన లొకేషన్లలో దిగిన ఫొటోలను ఆస్ యూజువల్ గా సోషల్ మీడియాలో పంచుకుంది.
ట్విస్ట్ ఏంటంటే..రష్మికకు వెళ్లడానికి ఒక రోజు ముందుగానే.. విజయ్ దేవరకొండ కూడా ఒమన్ వెళ్లాడు. అక్కడి లొకేషన్లను పిక్స్ తీసి.. సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు. రష్మిక, విజయ్ పంచుకున్న ఫొటోల్లో లొకేషన్లు దాదాపుగా ఒకే రకంగా ఉండడాన్ని గమనిస్తున్న నెటిజన్లు, ఫ్యాన్స్ అంతా.. ఇద్దరూ కలిసే ఒమన్ కు వెళ్లి వేడుక చేసుకుని ఉంటారు.. అనుకుంటున్నారు. ఇలా వెళ్లిరావడం ఇద్దరికీ అలవాటేగా అని కూడా కామెంట్ చేస్తున్నారు. రష్మిక, విజయ్.. ఇద్దరూ ఇలా వెళ్లి వేడుకలు చేసుకోవడం అన్నది ప్యూర్ గా వాళ్ల పర్సనల్ థింగ్.
కానీ.. పుష్ప 2(pushpa 2), యానిమల్(animal), ఛావా(chava), సికందర్(sikander) వంటి సినిమాలతో రష్మిక నేషనల్ క్రష్ గా మారింది. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా.. నేషనల్ వైడ్ గా రౌడీ స్టార్ అన్న పాపులారిటీని సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. అలాంటి ఈ ఇద్దరూ.. కలిసి జర్నీ చేస్తున్న తీరు సహజంగానే అందరినీ ఆకట్టుకునేలా చేస్తోంది. ఇలా.. దాగుడుమూతలు ఆడుతూ.. తోడుదొంగల్లా ఉండకుండా.. డైరెక్ట్ గా ఇద్దరూ కలిసి కనిపిస్తే బాగుంటుంది కదా అని అంతా అనుకుంటున్నారు. అదే జరిగితే.. మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ చెప్పేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ఫ్యాన్స్ కూడా అంటున్నారు.