లేడీ సూపర్ స్టార్.. లేడీ అమితాబ్ గా అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన స్టార్ నటి విజయశాంతి(Vijayashanti).. అతి త్వరోలో విడుదల కానున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun Son of Vyjayanthi)సినిమా కోసం పెద్ద సాహసమే చేశారు. సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన ఆమె.. తన క్యారెక్టర్ కు తగినట్టుగా కనిపించడం కోసం ఏకంగా 10 కిలోల బరువు తగ్గారు. వాస్తవానికి.. ఈ సినిమా చేసేందుకు ముందుగా ఆమె అంగీకరించలేదు. కానీ.. వైజయంతి పాత్రలో విజయశాంతి అయితేనే సరిగ్గా ఉంటారని భావించి.. చిత్ర హీరో నందమూరి కల్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) చాలా కాలం వెయిట్ చేశారట. ఆయన ఎంతగానో బతిమాలడంతో.. చివరికి ఈ సినిమా చేసేందుకు విజయశాంతి అంగీకరించారట.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ రోల్ చేశారు విజయశాంతి. అయితే.. గతంలో తాను కర్తవ్యం లాంటి సినిమాల్లో చేసిన పాత్రతో వైజయంతిని పోల్చి చూస్తారు కాబట్టి.. కచ్చితంగా బరువు తగ్గాలని తనకు తానుగా ఆమె నిర్ణయం తీసుకున్నారట. సినిమా ఒప్పుకున్న తర్వాత.. ఏకంగా నాలుగు నెలలు కష్టపడి 8 కిలోల బరువు తగ్గారట. షూటింగ్ మొదలైన తర్వాత కూడా అదే తీరుగా ఫుడ్ కంటిన్యూ చేస్తూ మరో 2 నెలలు తగ్గారట. ఇలా.. నాన్ వెజ్ మానేసి.. రోజూ జిమ్ కు వెళ్లి వర్కవుట్స్ చేసి.. ప్రత్యేకమైన హెల్దీ డైట్ తీసుకున్న కారణంగానే.. తాను 10 కిలోల బరువు తగ్గి క్యారెక్టర్ కు తగినట్టుగా లుక్ ను మార్చుకున్నట్టు చెప్పారు.. విజయశాంతి.
విజయశాంతి చేసిన ఈ సాహసం.. మంచి రిజల్ట్ ఇచ్చిందని అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్ర యూనిట్ చెబుతోంది. ఇంత వయసులో అంత సాహసాన్ని చేసిన విజయశాంతికి.. అభిమానులు కూడా సెల్యూట్ చేస్తున్నారు. సినీ ప్రేమికులైతే.. అభినందనలు తెలియజేస్తున్నారు. ఇంత కష్టం మంచి ఫలితాన్ని ఇచ్చి.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఘన విజయం సాధించాలని.. సినిమాలో నటించిన వారికి, పని చేసిన బృందం మొత్తానికి మంచి అనుభవాన్ని అందించాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా.. సినిమా నచ్చి క్యారెక్టర్ కోసం ఎంతగానో శ్రమించిన విజయశాంతికి అవార్డులు కూడా అందాలని ఆకాంక్షిస్తూ.. ఆమెతో పాటు సినిమా యూనిట్ మొత్తానికి ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు.
మరి.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా అంచనాలను అందుకుంటుందా.. విజయశాంతి, కల్యాణ్ రామ్ ల నమ్మకాన్ని నిలబెడుతుందా?