Home Andhra Pradesh Anna lezhneva Tirumala visit :మార్క్ కోసం.. మొక్కు తీర్చుకున్న తల్లి

Anna lezhneva Tirumala visit :మార్క్ కోసం.. మొక్కు తీర్చుకున్న తల్లి

Pawan Kalyan's Wife Anna Leznova Offers Hair at Tirumala After Son Mark’s Recovery – Devotion Wins Hearts
Pawan Kalyan's Wife Anna Leznova Offers Hair at Tirumala After Son Mark’s Recovery – Devotion Wins Hearts

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భార్య అన్నా లెజ్‌నోవా (Anna Lejnova).. అందరికీ షాక్ ఇచ్చింది. కొడుకు మార్క్ (Mark) ఆరోగ్యం కుదుటపడడంతో.. ఆమె తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంది. సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత.. తిరుమలకు వెళ్లిన అన్నా.. అక్కడ డిక్లరేషన్ లో సంతకం చేసింది. స్వతహాగా క్రిస్టియన్ అయిన ఆమె.. శ్రీవారిపై నమ్మకం, హిందూ సంప్రదాయంపై గౌరవం ఉందని చెబుతూ.. డిక్లరేషన్ ప్రక్రియ పూర్తి చేసింది. తర్వాత.. తిరుమలలో స్వామివారి కోనేరు పక్కనే ఉన్న వరాహస్వామి వారిని దర్శనం చేసుకుంది. అక్కడి నుంచి పద్మావతి కల్యాణకట్టకు (Padmavati Kalyanakatta) చేరుకుని.. తోటి భక్తులతో కలిసి తలనీలాలు సమర్పించి.. మొక్కులు చెల్లించుకుంది.

ఇది చూసిన వాళ్లంతా.. ముందు షాక్ అవుతున్నా.. తర్వాత అన్నా లెజ్‌నోవాను అభినందిస్తున్నారు. పవన్ కల్యాణ్ ను పెళ్లి చేసుకోవడమే కాదు.. ఆయన పాటిస్తున్న సంప్రదాయాన్ని ఏ మాత్రం జంకు లేకుండా కొనసాగిస్తున్నందుకు ప్రశంసిస్తున్నారు. విదేశానికి చెందిన మహిళ అయినా కూడా.. భారతదేశ సంస్కృతిలో భాగమైన తర్వాత.. ఇక్కడి అలవాట్లకు అనుగుణంగా తన వ్యవహారాన్ని మార్చుకోవడాన్ని అంతా స్వాగతిస్తున్నారు. ఇంతకుముందు కూడా.. చాలా సందర్భాల్లో పవన్ తో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లినప్పుడు భారతీయ చీర కట్టుతో.. నుదుటన సింధూరంతో కనిపించి.. అంతా ముచ్చటపడేలా చేసింది.. అన్నా లెజ్‌నోవా. ఇప్పుడు తిరుమల శ్రీవారికి (Tirumala Srivaru) ఇలా తలనీలాలు సమర్పించి శభాష్ అనిపించుకుంది.

మరోవైపు.. తలనీలాలు సమర్పించేందుకు వెళ్లిన అన్నా గురించి.. పద్మావతి కల్యాణకట్టలో పని చేసిన సిబ్బంది, క్షురకులు.. ఆసక్తిగా తెలుసుకున్నారు. చాలా జాగ్రత్తగా అన్నాకు తలనీలాలు తీశారు. ఆ తర్వాత ఆమెతో కలిసి ఫొటోలు దిగారు. ఈ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంతరం.. ఈ రోజు ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న వేంకటేశ్వరస్వామి (Lord Venkateswara Swamy) దర్శనం చేసుకుంది. ఇక.. పవన్ కల్యాణ్ అభిమానులైతే ఈ విషయంపై మామూలు సందడి చేయడం లేదు. తమ వదిన అన్నా లెజ్‌నోవా.. తలనీలాలు సమర్పిస్తున్న విజువల్స్ ను తెగ షేర్ చేసేస్తున్నారు. ఇప్పటికే మార్క్ ఆరోగ్యం కోసం పూజలు, ప్రార్థనలు చేసిన వాళ్లంతా.. అతను కోలుకున్నాడని తెలిసి సంతోషపడుతున్నారు. పవన్ ధైర్యంగా ఉండాలంటూ.. అండగా నిలుస్తున్నారు.

అన్నా లెజ్‌నోవా.. తిరుమల శ్రీవారికి మొక్కు తీర్చుకున్న ఈ సందర్భంపై..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here